Monday, June 8, 2026
Homeసినిమాశ్రీ శృంఖలా దేవి ఫిల్మ్స్ నూతన  చిత్రం ప్రారంభం

శ్రీ శృంఖలా దేవి ఫిల్మ్స్ నూతన  చిత్రం ప్రారంభం

అర్జున్ కళ్యాణ్, వసంతి జంటగా శ్రీ శృంఖలా దేవి ఫిల్మ్స్ సంస్థ తమ ప్రొడక్షన్ నెం.1 మూవీకి శ్రీకారం చుట్టింది. ఈ చిత్ర షూటింగ్  ప్రారంభోత్సవానికి సెన్సేషనల్ డైరెక్టర్ మారుతి ముఖ్య అతిథిగా హాజరై..ఫస్ట్ షాట్ కు క్లాప్ నిచ్చారు. కొత్త దర్శకుడు రామరాజు.జి  దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిత్ర కథను తెలుసుకొన్న దర్శకుడు మారుతి, స్టోరీ చాలా క్రియేటివ్ గా బాగుందంటూ టీమ్ ని అభినందించారు. త్వరలోనే షూటింగ్ మొదలపెట్టనున్న ఈ మూవీని సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయడానికి ప్లాన్ చేశారు. రోడ్ ట్రిప్ బ్యాక్ డాప్ లో జరిగే ఈ థ్రిల్లర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుందని దర్శకుడు రామరాజు.జి. తెలిపారు.

కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. పక్కా ప్లానింగ్ తో చాలా ఫాస్ట్ గా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేశారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.  అర్జున్ కళ్యాణ్, వసంతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి – మురళీధర్ సింగు, సంగీతం – మహవీర్ యెలందర్, విజువల్ ఎఫెక్ట్స్ : మహత్రు మీడియా సొల్యూషన్స్, లిరిక్స్ : పూడి శ్రీనివాస్, పీఆర్ ఓ : జి యస్ కె మీడియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వీరబాబు .కె, ప్రొడ్యూసర్ : జి. రాధిక, రచన, దర్శకత్వం : రామరాజు.జి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular