Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్షూటింగ్ లో సింగ్ రాజ్ కు కాంస్యం

షూటింగ్ లో సింగ్ రాజ్ కు కాంస్యం

పారాలింపిక్స్ లో ఇండియా నేడు మరో పతకం సాధించింది. పి-1 పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్.హెచ్.1 విభాగంలో భారత షూటర్ సింగ్ రాజ్ అధానా కాంస్య పతకం గెల్చుకున్నాడు.

చైనా కు చెందిన ఆటగాళ్ళు చావో యాంగ్,  జింగ్ హువాంగ్ లు వరుసగా 237.9; 237.5 పాయింట్లతో స్వర్ణ, రజత పతకాల గెల్చుకోగా, 216.8 పాయింట్లతో సింగ్ రాజ్ కాంస్య పతకం సాధించాడు. క్వాలిఫైంగ్ రౌండ్లో మనదేశానికి చెందిన మనీష్ అగ్రస్థానంలో నిలిచి ఫైనల్ కు చేరినప్పటికీ పతక సాధనలో విఫలమయ్యాడు. షూటింగ్ లో ఇండియాకు ఇది రెండో పతకం, నిన్న అనిల్  లేఖరా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్.హెచ్.1 విభాగంలో స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే.

సింగ్ రాజ్ కాంస్య పతకంతో టోక్యోలో జరుగుతున్న 2020 పారాలింపిక్స్ క్రీడల్లో ఇండియా ఇప్పటివరకూ ఎనిదిమి పతకాలు గెల్చుకుంది. వీటిలో రెండు స్వర్ణ, నాలుగు రజత, రెండు కాంస్యాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular