Monday, June 8, 2026
Homeస్పోర్ట్స్యూఎస్ టైటిల్ విజేత మెద్వదేవ్

యూఎస్ టైటిల్ విజేత మెద్వదేవ్

రష్యా ఆటగాడు డానియెల్ మెద్వదేవ్ ఈ ఏడాది యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్  గెల్చుకున్నాడు. సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ పై ­6-4, 6-4, 6-4 తేడాతో విజయం సాధించి తన కెరీర్ లో మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను అందుకున్నాడు.

ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్ లో నంబర్ 2గా  కొనసాగుతున్న మెద్వదేవ్, నంబర్ వన్ ర్యాంకర్ జకోవిచ్ పై ఆట మొదటి నుంచీ తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. రెండు గంటల 16 నిమిషాల పాటు సాగిన ఆటలో జకోవిచ్ ను నిలువరించేందుకు మెద్వదేవ్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టైటిల్స్ గెల్చుకున్న జకోవిచ్, యూఎస్ ఓపెన్ కూడా గెల్చుకొని ఒకే ఏడాది నాలుగు మేజర్ టైటిల్స్ గెల్చుకున్న డాన్ బడ్జ్, రాడ్ ల్యావర్  ల సరసన చోటు సంపాదించాలన్న ఆశలు నెరవేరలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular