Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్రాజస్థాన్ అద్భుత విజయం

రాజస్థాన్ అద్భుత విజయం

ఐపీఎల్లో నేడు జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆట చివరి ఓవర్లో నాలుగు పరుగులు కావాల్సి ఉండగా పంజాబ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్లో రాజస్థాన్ బౌలర్ కార్తీక్ త్యాగి రెండు వికెట్లు పడగొట్టి పంజాబ్ విజయావకాశాలను దెబ్బతీశాడు.

టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. తొలి వికెట్ కు 54  పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఓపెనర్ ఎవిన్ లూయీస్ 21 బంతుల్లో  7ఫోర్లు, ఒక సిక్సర్ తో 36  పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ సంజూ సామ్సన్ ఈ మ్యాచ్ లో విఫలమయ్యాడు. కేవలం నాలుగు పరుగులకే ఔటయ్యాడు  ఆ తర్వాత వచ్చిన లివింగ్ స్టోన్ 17 బంతుల్లో 2ఫోర్లు, ఒక సిక్సర్ తో 25  పరుగులు చేసి ఔటయ్యాడు. ఓపెనర్ యశస్వి జైసవాల్ 36 బంతుల్లో  6 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో బ్యాట్స్ మాన్ మహిపాల్ లోమ్రోర్ కేవలం 17 బంతుల్లో 2ఫోర్లు, నాలుగు సిక్సర్లతో  43  పరుగులు చేసి రాజస్థాన్ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు.

నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ 185 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో ఆర్ష దీప్ సింగ్ ఐదు వికెట్లతో రాణించాడు. మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా హర్ ప్రీత్ బార్, ఇషాన్ పోరెల్ లకు చెరో వికెట్ దక్కింది.

185 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ మొదట్లో దాటగానే ఆడింది మొదటి వికెట్ కు కేఎల్ రాహుల్- మయాంక్ అగర్వాల్ లు  120 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 49  పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే మయాంక్ అగర్వాల్ (43 బంతుల్లో 7 ఫోర్లు,  2 సిక్సర్లతో 67  పరుగులు) కూడా ఔటయ్యాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్,  మర్ క్రమ్ లు అదే ధాటి కొనసాగించారు. ]

అయితే ఆఖరి ఓవర్లో విజయానికి నాలుగు పరుగులు కావాల్సిన దశలో త్యాగి అద్భుతమైన బంతులతో రెండు వికెట్లు పడగొట్టి కేవలం ఒక్కపరుగు మాత్రమే ఇచ్చాడు. దీనితో రాజస్థాన్ రెండు పరుగులతో విజయం సాధించింది. కార్తీక్ త్యాగి కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది

RELATED ARTICLES

Most Popular

న్యూస్