రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఈ రోజు నుంచి నాలుగు రోజులపాటు జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్టోబర్ రెండో తేదిన జమ్మూ విశ్వవిద్యాలయంలోని జోరవర్ సింగ్ ఆడిటోరియం జరిగే సెమినార్ తో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గ్రామీణ అభివృద్ధి, విద్య, వైద్య రంగాల్లో ఆర్.ఎస్.ఎస్ జమ్మూ కాశ్మీర్ లో చేపట్టిన సేవా కార్యక్రమాలు సమీక్షించనున్నారు. అక్టోబర్ మూడో తేదిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జమ్మూ కాశ్మీర్ సంఘ్ వాలంటీర్స్ కు భవిష్యత్ కార్యచారనపై సందేశం ఇవ్వనున్నారు.
370 ఆర్టికల్ రద్దు తర్వాత ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలాక్ జమ్మూ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 2016 తర్వాత ఆర్.ఎస్.ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లోయలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత సంఘ్ బలోపేతం అవుతోంది. ఆర్.ఎస్.ఎస్ మార్గ దర్శనంలో ప్రభుత్వం సామజిక అవగాహన కార్యక్రమాలు విరివిగా చేపడుతున్నారు. కరోనా మొదటి, రెండో దశల్లో సంఘ్ వాలంటీర్స్ సేవాతత్పరతకు జమ్మూ కాశ్మీర్ లో కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయి. 370 ఆర్టికల్ రద్దు తర్వాత, కోవిడ్ మహమ్మారి విస్తరణ సమయంలో సంఘ్ చేపట్టిన కార్యక్రమాలకు ప్రజలు సహకారం పెరిగింది. గతంలో కన్నా ఇప్పుడు లోయలో ఆర్.ఎస్.ఎస్ పునాదులు బలపడుతున్నాయి.