Tuesday, June 9, 2026
Homeసినిమాఅక్టోబ‌ర్ 8న గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’

అక్టోబ‌ర్ 8న గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’

గోపీచంద్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ జోనర్‌లో ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా తెరకెక్కింది. గోపీచంద్ సరసన నయనతార హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వం వహించారు. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ మీద తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రాన్ని అక్టోబర్ 8న విడుదల చేయబోతోన్నట్టు పోస్టర్‌ను విడుదల చేశారు.

 ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, చలపతి రావు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించారు. బాల మురుగన్ కెమెరామెన్‌గా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. వక్కంతం వంశీ కథ అందించగా.. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. విభిన్న క‌థాంశంతో రూపొందిన ఆరెడుగుల బుల్లెట్ ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular