మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ‘క్రాక్’ బ్లాక్ బస్టర్ తో రవితేజ ఫాంలోకి వచ్చారు. ప్రస్తుతం అయన వరుస ప్రాజెక్ట్‌ లను ఓకే చేస్తున్నారు. అందులో భాగంగా మరో కొత్త సినిమా అప్డేట్ ఇచ్చేశారు. రవితేజ కెరీర్‌లో 69వ సినిమా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌కు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సినిమాల్లో ఎంతటి వినోదం ఉంటుందో అందరికీ తెలిసిందే.

అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ మూవీ టైటిల్‌ ఇంకా ఫిక్స్ కాలేదు. ‘RT69’గా రాబోతోన్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత, వివేక్ కూచిబొట్ల సహ నిర్మాత. ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో ఫేమస్ నటీనటులు కనిపించబోతన్నారు.

ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. భీమ్స్ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక బృందాన్ని చిత్రయూనిట్ త్వరలోనే ప్రకటించనుంది. రవి తేజ, త్రినాథరావు నక్కిన కాంబోలో రాబోతోన్న RT69 కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని, థియేటర్లో ఆడియెన్స్‌ ను నవ్వించేలా ఉండబోతోందని నిర్మాత విశ్వప్రసాద్ ధీమాగా ఉన్నారు. అక్టోబర్ 4 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *