క్రియశీల రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో దుతేర్తే ప్రకటించారు. ఈ మేరకు రాజధాని మనీలాలో ఓ ప్రకటన విడుదల చేశారు. వచ్చే ఏడాది రోడ్రిగో పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో రోడ్రిగో రాజకీయ సన్యాసం సంచలనంగా మారింది. ఫిలిప్పీన్స్ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తీ ఒక దఫా ఆరు సంవత్సరాలు మాత్రమే దేశాధ్యక్షుడుగా కొనసాగేందుకు అనుమతిస్తుంది. పిడిపి లబాన్ పార్టీకి చెందిన రోడ్రిగో దుర్తెతే విధానపరమైన నిర్ణయాల్లో కొంత వివాదాస్పదుడు అయ్యాడు.

ఫిలిప్పీన్స్ రాజకీయాల్లో బలమైన నాయకుడిగా పేరున్న 76 ఏళ్ల రోడ్రిగో దుర్తెతే 2016 లో దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మాదకద్రవ్యాల వాడకం, రవాణ, దేశంలో అంతకంతకు పెరుగుతున్న క్రైమ్ రేట్ తగ్గిస్తాననే వాగ్దానంతో  రోడ్రిగో అధికారంలోకి వచ్చారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన ద్యుతెర్తే చండ శాసనుడిగా నిలిచారు. డ్రగ్స్ కట్టడి చేసే క్రమంలో వేలమందిని హతమార్చారని రోడ్రిగోపై ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఆయనపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. దేశ ప్రజల్లో మెజారిటి వర్గం మాదక ద్రవ్యాల వ్యవహారంలో ద్యుతెర్తే విధానాలు సరైనవే నని సమర్థిస్తున్నారు.

దుర్తెతే తో సుధీర్గ కాలంగా ఉన్న ఉపాధ్యక్షుడు, సెనెటర్ బోంగ్ గో కొత్త అధ్యక్షుడిగా బరిలోకి దిగనున్నారు. రోద్రిగో కుమార్తె సర దుతెర్తే కార్పియో కూడా రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుతం దావో నగర మేయర్ గా వ్యవహరిస్తున్నారు. దుతెర్తే కార్పియో కూడా అధ్యక్ష పదవికి రేసులో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *