రాష్ట్రంలో కోవిడ్ కు సంబంధించిన వాక్సిన్, మందులు తయారు చేస్తున్న కంపెనీలకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి కేటిఆర్ హామీ ఇచ్చారు. కోవిడ్ పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్సు నేడు ప్రగతి భవన్ లో సమావేశమైంది.
వాక్సిన్ సరఫరా, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలను ఈ భేటిలో చర్చించారు. కోవిడ్ చికిత్సలో ఉపయోగిస్తున్న రెమిడిసివర్ ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని కేటిఆర్ హామీ ఇచ్చారు.
ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశానికి నాట్కో ఫార్మా, బయోలాజికల్ ఈ, భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సనోఫి ఇండియా, వర్చ్యు బయోటెక్, గ్లాండ్ ఫార్మా, ఇండియన్ ఇమ్మునోలాజికల్స్ మరియు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కంపెనీలకి చెందిన పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉన్న ఉన్నతాధికారులు జయేష్ రంజన్, వికాస్ రాజ్, సందీప్ కుమార్ సుల్తానియ, రాహుల్ బొజ్జా, రాజశేఖర్ రెడ్డి లతో పాటు టిఎస్ ఐఐసి ఎండి నరసింహారెడ్డి, శక్తి నాగప్పన్ లు పాల్గొన్నారు.