Sunday, May 19, 2024
Homeఫీచర్స్నిందలపాలయ్యా !...

నిందలపాలయ్యా !…

Q. నా వయసు 26 సంలు.ఉద్యోగం చేస్తున్నాను. మా చుట్టాలబ్బాయి ప్రేమిస్తున్నానని విసిగించేవాడు. చాలా సార్లు తిరస్కరించాను. తర్వాత అతను ఆత్మహత్య చేసుకుని ఉత్తరంలో అప్పులు,ప్రేమ వైఫల్యం కారణాలుగా పేర్కొన్నాడు. దాంతో మా చుట్టాలందరూ నా గురించి చెడుగా ప్రచారం చేశారు. నేను ఎన్నడూ అతనితో మాట్లాడిందిలేదు,తిరిగిందీ లేదు. ఏ తప్పూ చెయ్యకపోయినా ఇలా నిందలపాలు అయ్యాను. పెళ్లి చేసుకుందామనుకునే టైం లో ఇలా జరిగింది. నాకు తండ్రి లేడు. తల్లి మాత్రమే ఉంది. ఈ సమస్య పెళ్లికి సమస్య కాకుండా ఎలా పరిష్కరించుకోవాలో తెలియడం లేదు
-రమ

A. మీ ప్రమేయం లేకుండా జరిగిన వాటికి మీరు బాధపడక్కరలేదు. ఎవరో ఏదో అన్నారనో అంటారనో పట్టించుకోకండి. లోకం అంతే. బాధపెట్టాలనే చూస్తుంది. లెక్కచేయకుండా సాగిపోవడమే విజ్ఞత. అయితే బంధువులే ఆడపిల్లపై ఇటువంటి నిందలు వేయడం విచారకరం. నిజానికి తండ్రిలేని అమ్మాయికి మరింత అండగా ఉండాలి. మీరీ విషయాలేమీ పట్టించుకోకండి. ఉద్యోగంపైనే దృష్టి పెట్టండి. వీలయితే వేరే ఊరు బదిలీ చేయించుకోండి. నిరభ్యంతరంగా పెళ్లి ప్రయత్నాలు సాగించండి. సహృదయులెవరూ ఇటువంటి చిల్లర ప్రచారం పట్టించుకోరు.

-కె.శోభ,
ఫ్యామిలీ కౌన్సెలర్,
హార్ట్ టు హార్ట్,
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్