Sunday, June 7, 2026
HomeTrending Newsపూణే, ముంబయ్‌ల మధ్య ఎలక్ట్రిక్ బస్సు

పూణే, ముంబయ్‌ల మధ్య ఎలక్ట్రిక్ బస్సు

దేశంలో అగ్రగామి ఎలక్ట్రిక్ బస్ ఆపరేటర్, ఎంఈఐఎల్ గ్రూపు కంపెనీ, ఈవీ ట్రాన్స్ దేశంలో తొలిసారి ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సు సేవలను పూణే, ముంబయ్‌ల మధ్య బుధవారం లాంఛనంగా ప్రారంభించింది. కాలుష్య రహిత, శబ్ద రహిత, సౌకర్యవంతమైన ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణాలు చేయాలన్న చిరకాల కల దీంతో నెరవేరబోతున్నది. ఈ సేవలు దసరా నుంచి ప్రతి రోజు రెండు నగరాల మధ్య నడపనుంది. కేంద్ర ప్రభుత్వం, ఫేమ్ 1, ఫేమ్ 2 పథకాలతో దేశీయ ప్రజా రవాణా రంగంలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే.

కొత్తగా ప్రారంభించిన పూరీ బస్సు సేవలను వివరిస్తూ ఈవీ ట్రాన్స్‌ జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ రైజాడ, మాట్లాడుతూ, దేశంలో తొలిసారిగా ఇంటర్ సిటీ బస్ సర్వీసులను ప్రారంభిస్తున్నందుకు గర్వకారణంగా, సంతోషంగా వుంది. ఇప్పటికే వివిధ నగరాల్లో ఎలక్ట్రిక్‌ ఇంట్రా సీటీ బస్సులను నిర్వహిస్తున్న ఈవీ ట్రాన్స్‌, ఇప్పుడు నగరాల మధ్య ఇంటర్‌ సీటీ రూట్లలో బస్సులను ప్రవేశపెట్టడం ద్వారా దూర ప్రాంతాలకు ఎలక్ట్రిక్‌ బస్సులు లేని లోటును తీర్చినట్టయింది. పూరి బస్‌ ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే, 350 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీంతో ఇంటర్‌ సిటీ సర్వీసులను ప్రారంభించాలనుకునే ఆపరేటర్లకు ఈ బస్సు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నది. కాలుష్యం లేని దూర ప్రాంత ప్రయాణాలకు ఈ బస్సులను వినియోగించడం ద్వారా భారీగా వ్యయాలను ఆదా చేయవచ్చు అన్నారు.

12 మీటర్ల పూరి బస్సు
కాలుష్య రహిత, ఎలక్ట్రిక్ ఇంటర్ సిటీ కోచ్ బస్సులో 45 మంది ప్రయాణీకులతో పాటు, డ్రైవర్, కో డ్రైవర్ కూర్చోవచ్చు. అత్యంత సుందరంగా డిజైన్ చేసిన ఈ బస్సు ప్రయాణీకులకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ఏసీ ఎలక్ట్రిక్ బస్సును సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణించడానికి వీలుగా అత్యంత సౌకర్యవంతంగా పుష్ బ్యాక్ సీట్లతో డిజైన్ చేశారు. ఇందులో ఆధునిక టీవీ, ఇన్ఫోటెయిన్‌మెంట‌్‌, వైఫై తో పాటు ప్రతి సీటుకు ఇన్‌బిల్ట్ యుఎస్‌బీ ఛార్జర్‌ను అమర్చడంతో ప్రయాణం వినోదాత్మకంగా ఉంటుంది. లగేజి కోసం 5 క్యూబిక్‌ మీటర్ల సువిశాల స్పేస్‌ ఏర్పాటు వుంది.

డీజిల్‌ బస్సుతో పోల్చితే, పూరి ఎలక్ట్రిక్‌ బస్సును నిర్వహించడానికి తక్కువ వ్యయం కావడం వల్ల ఇంటర్‌ సిటీ బస్‌ ఆపరేటర్లకు ఆర్థికంగా చాలా ఆదా అవుతుంది. ఈ బస్సును లీ ఐయాన్‌ ఫాస్సేట్‌ బ్యాటరీ అమర్చడం ద్వారా, ఒక సారి ఛార్జ్‌ చేస్తే ట్రాఫిక్‌, ప్యాసింజర్‌ లోడ్‌లను బట్టి 350 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. ఈ బస్సులను ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ లిమిటెడ్‌ దేశీయంగా తయారు చేస్తున్నది.

ఈ బస్సులో అనేక భద్రత పరికరాలను అమర్చారు. యూరోపియన్‌ యూనియన్‌ ప్రమాణాల ప్రకారం ఎఫ్‌డీఎస్ఎస్ సిస్టమ్‌‌ను టీయువీ సర్టిఫికేషన్‌తో అమర్చారు. ఏడీఏఎస్‌ సిస్టమ్‌ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌), భారతీయ రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా ఐటీఎస్‌ సిస్టమ్‌ను అమర్చారు. అలాగే ఎలాంటి ఆపత్కాలాన్నైనా ఎదర్కునేందుకు ప్యానిక్‌ అలారమ్‌ సిస్టమ్‌, ప్రమాద సమాయాల్లో ఎమర్జెన్సీ లైటింగ్‌ సిస్టమ్‌ను కూడా అమర్చారు.

ఈవీ ట్రాన్స్‌ పూణే, సూరత్, సిల్వాస, గోవా, డెహ్రాడూన్‌, హైదరాబాద్ తదితర నగరాల్లో బస్సులను నడుపుతున్నది. ఇంటర్‌ సీటీ సేవలను పూరీ బస్‌ పేరుతో ప్రారంభించడం ద్వారా, ఈవీ ట్రాన్స్‌ తన నిర్వహణా సామర్థ్యాలను మరోసారి నిరూపించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular