Thursday, March 12, 2026
Homeసినిమాముందే వస్తున్న ‘రొమాంటిక్’

ముందే వస్తున్న ‘రొమాంటిక్’

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మాణంలో ఆకాష్ పూరి హీరోగా రూపొందుతున్న ‘రొమాంటిక్’ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు కానీ తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అనుకున్నదానికంటే ఓ వారం ముందుగానే సినిమాను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 29న ఈ చిత్రం థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

విడుదల తేదీని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన‌ పోస్టర్‌లో కేతిక శర్మ.. ఆకాష్ పూరి ఇద్దరి జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యేట్టు కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ నిర్మించడమే కాకుండా.. కథను, మాటలు, స్క్రీన్ ప్లేను అందించారు. పూరి జగన్నాథ్ శిష్యుడు అనిల్ పాదూరి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్ల పై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

రమ్యకృష్ణ  ప్రధాన పాత్రలో నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ‘రొమాంటిక్’ చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తుండగా.. నరేష్ సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. మేకర్స్ ఇప్పటి వరకు మూడు పాటలను రిలీజ్ చేశారు. అన్నీ కూడా అద్భుతమైన రెస్పాన్స్‌ తో దూసుకుపోతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular