వచ్చే ఏడాది మార్చి 28వ తేదిన యాదాద్రి ఆలయం పునఃప్రారంభమవుతుందని, దీనికి సరిగ్గా పది రోజుల ముందు అంకురార్పణ కార్యక్రమం ఉంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. యదాద్రి ఆలయ పనులు పర్యవేక్షించిన సిఎం కెసిఆర్ రోజంతా ఆలయ ప్రాంగణం, సమీప ప్రాంతాల అభివృద్దిపై అధికారులు, మంత్రులతో పరిశీలించారు.
ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ…
సమైక్యాంధ్రలో నిర్లక్ష్యానికి గురయినం, ఆధ్యాత్మిక రంగంలో వెనుకబడినం. గోదావరి,కృష్ణ,ప్రాణహిత పుష్కరాల నిర్వహణ ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించలేదు, ప్రత్యేక తెలంగాణలో మనం ఘనంగా నిర్వహించినం. తెలంగాణలో విశిష్టత కలిగిన దేవాలయం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం మా కుటుంబంతో కలిసి 50 సంవత్సరాల క్రితం వచ్చినము. అమ్మవారి ఆలయం జోగులాంబ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తెలంగాణలో ఉంది,తెలంగాణ రాష్ట్ర అనంతరం పుష్కరాలలో ప్రచారం చేసినం. యాదాద్రి ఆలయంను అద్భుతంగా తీర్చిదిద్దే పనిలో పడ్డాము .. కిషన్ రావు ఆధ్వర్యంలో పనులు సాగుతున్నాయి .. నిబద్ధత కలిగిన వ్యక్తి కిషన్ రావు. పుణ్యక్షేత్రాల పునర్నిర్మాణంతో కొత్తగా కనిపిస్తుంది.
ఆలయ నిర్మాణం, ప్రారంభం ఆగమనశాస్త్రం ప్రకారం చేయాల్సి ఉంటుంది. చినజీయర్ స్వామి ఆదేశాలతో పనులు సాగుతున్నాయి … యాదాద్రి కరువుతో ఉంది కాని ఈరోజు కాళేశ్వరంతో బస్వపురం ప్రాజెక్టు పేరుతో అభివృద్ధి జరిగింది. బస్వపురం తెలంగాణలో రెండోవ పెద్ద ప్రాజెక్టు నిర్మాణం యాదాద్రిలో సాగుతుంది. యాదాద్రిలో గతంలో ఎక్కువ భూమి లేకపోతే ప్రభుత్వం కొనుగోలు చేసి VVIP లకు ముఖ్యమైన వ్యక్తులకు మంచి నివాసాల నిర్మాణం సాగుతుంది. అద్భుతమైన సూట్ లను భక్తుల విరళంతో నిర్మిస్తున్నారు. చినజీయర్ స్వామి ముహూర్తం ఖరారు చేశారు. మహా సుదర్శన యాగంతో ప్రారంభం అవుతుంది. ముఖ్య అర్చకుల చేత యాగం జరుగుతుంది. పెద్దల అంగీకారంతో యాగం జరుగుతుంది.
125 kgల బంగారంతో ఆలయ గోపురం
స్వామివారి దీవెనలతో నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మార్చ్ 28వ తేదిన మహాకుంభ సంప్రోక్షణ జరుగుతుంది. అంతకుముందు 8 రోజులు పూజలు జరుగుతూనే ఉంటాయి. వివిధ ప్రాంతాల నుండి పీఠాధిపతులు,అమెరికాలో ఉన్న పూజారులు హాజరవుతారు. ఏదయినా పొరపాటు జరిగిన స్వామివారు క్షమించి తన కార్యాన్ని పూర్తి చేసుకోవాలని కోరుతున్న. ఇప్పటినుండి మంత్రులపై, నాపై మరింత బాధ్యత పెరిగింది. స్వామివారి గర్భగుడి పై విమాన గోపురం స్వర్ణమయంగా చేయించాలని నిర్ణయం తీసుకున్నాం .. 125 kgల బంగారంతో గోపురం చేస్తున్నాం … 65 కోట్ల వరకు అవుతుంది. ఇందుకు 12,769 గ్రామపంచాయతీలు, 3.069 మున్సిపాలిటీలు , కార్పొరేషన్ లు ఉన్న రాష్ట్రంలో ప్రతిఒక్కరికి బాద్యులుగా చేస్తాం. బంగారం కొనుగోళ్లు కమిటీ పర్యవేక్షణలో ఉంటుంది.
కేసీఆర్ కుటుంబం నుండి 1.16 తులలు అందిస్తాం .. మేడ్చల్ నియోజకవర్గం నుండి 1 kg బంగారం ఇస్తాం. దాతలు చాలా మంది విరాళం అందిస్తాం అన్నారు. జీయర్ పీఠం నుండి 1 kg బంగారం ఇస్తాం అన్నారు. చాలామంది ముందుకు ఒస్తున్నారు, ప్రతి గ్రామం 11 రూపాయలు విరాళం ఇస్తే చాలు. గతంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి చేస్తున్నాం.
కరోనా సమయంలో కూడా ఆర్థిక వ్యవస్థ లో మొదటిస్థానం లో ఉన్నాం. కాటేజీలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన. కోర్టు కేసులను అధిగమించి అందరికి న్యాయం చేస్తాం. కొండపైన దేవపుష్కరిని మాత్రమే ఏర్పాటు చేసినం. 6కోట్ల 90 లక్షలతో బస్టాండ్ ఏర్పాటు .. కొండపైకి ఉచిత బస్సు ఏర్పాటు చేస్తాం. మార్చి మాసంలో గొప్పగా ప్రారంభోత్సవం చేసుకుందాం. యాదాద్రి అభివృద్ధిలో బాగంగం డ్రైనేజీ అద్భుతంగా చెస్తాం. PRC తో పాటు ఆలయ ఉద్యోగులకు ఇంటి స్థలం త్వరలో ఇస్తాం, జర్నలిస్ట్ లకు ఇళ్లస్థలలు ఇస్తాం. ఆలయానికి సంభందించిన వార్తలను దేశవ్యాప్తంగా వ్యాసాలు ఇవ్వాలి అని కోరుతున్నా. హుజురాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అందిస్తాం. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో చిన్న ఆటంకం. ఇంటర్నేషనల్ కన్వెన్షన్, సినిమా షూటింగ్ కోసం ఏర్పాటు చేస్తాం. మరోసారి వచ్చినప్పుడు ఇంకా లోటుపాట్లు చూసి సరిచేస్తా.