Sunday, June 7, 2026
Homeసినిమా‘జీ-5’ ఓటీటీలో నవంబర్ 26న ‘రిపబ్లిక్’ విడుదల

‘జీ-5’ ఓటీటీలో నవంబర్ 26న ‘రిపబ్లిక్’ విడుదల

Republic Will Be Premiering On Zee 5 From November 26th :

సాయి తేజ్ కథానాయకుడిగా దేవకట్టా దర్శకత్వంలో నిర్మాతలు జె. భగవాన్, జె. పుల్లారావు భాగస్వామ్యంతో జీ స్టూడియోస్ సంస్థ నిర్మించిన సినిమా ‘రిపబ్లిక్’. ఐశ్వర్య రాజేష్ కథానాయికగా… జగపతిబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభించింది.

కలెక్టర్ పాత్రలో సాయి తేజ్ నటన… సగటు రాజకీయ నాయకురాలిగా రమ్యకృష్ణ ఠీవి… ప్రభుత్వ ఉద్యోగిగా, తండ్రిగా జగపతిబాబు భావోద్వేగ భరిత అభినయం… దేవ కట్టా సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పతాక సన్నివేశాలు సమాజంలో ప్రజల ఆలోచనా విధానాన్ని సైతం ఎండగట్టాయి. ప్రజల్ని చైతన్యవంతం చేసే విధంగా ఉన్న ఈ చిత్రాన్ని ‘జీ 5’ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. సాయి తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా కూడా ‘జీ 5’ ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమా తర్వాత రూపొందిన ‘రిపబ్లిక్’ సైతం ‘జీ 5’ ఓటీటీలోకి‌ వస్తోంది. సాయి తేజ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ‘జీ 5’లో విడుదల కానుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ‘జీ 5’తో‌ అనుబంధం ఇలాగే కొనసాగాలని సాయితేజ్ ఆకాంక్షించారు.

వీక్షకులకు వినోదం అందించడమే పరమావధిగా ‘జీ 5’ వరుసగా కొత్త సినిమాలను విడుదల చేస్తోంది. దసరా పండక్కి శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’ను విడుదల చేసింది. దీపావళి కానుకగా ఈ నెల 4వ తేదీన ‘శ్రీదేవి సోడా సెంటర్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తోంది. ఆ తరువాత సుప్రీం హీరో సాయి తేజ్, దర్శకుడు దేవకట్టా కలయికలో రూపొందిన ‘రిపబ్లిక్’ చిత్రాన్ని విడుదల చేయనుంది.

Must Read :ఇంటికి చేరుకున్న సాయి ధరమ్ తేజ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular