Bheemla nayak Video Promo Mesmerizing The Audience :

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్‘. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. స్క్రీన్ ప్లే, సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ అందిస్తున్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘భీమ్లా నాయక్’ నుంచి మరో గీతం త్వరలో విడుదల కానుంది. దీనికి సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ ఓ ప్రచార చిత్రాన్ని, డైలాగ్ తో కూడిన వీడియోను విడుదల చేసింది. ప్రోమోను పరిశీలిస్తే … “నాగరాజు గారూ, హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండీ. మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసింది. హ్యాపీ దీపావళి” అంటూ కథానాయకుడు పవన్ కళ్యాణ్ ఎవరినో ఉద్దేశించి అనటం కనిపిస్తుంది. ప్రోమో చివరిలో ‘లాలా భీమ్లా’ పాట నవంబర్ 7 న విడుదల అన్న ప్రకటన కూడా కనిపిస్తుంది.

ప్రముఖ గీత రచయిత రామజోగయ్యశాస్త్రి సాహిత్యంలో ఆవిష్కృతమై ఇప్పటికే విడుదలైన పాట ‘భీమ్లానాయక్’ పాత్ర తీరుతెన్నులు, దమ్ము, ధైర్యానికి అక్షరరూపంలా, కథానాయకుడి గొప్పదనాన్ని వివరించేలా సాగింది. అలాగే విజయదశమి పర్వదినాన విడుదలైన ‘అంత ఇష్టమేందయ’ పాట అభిమాన ప్రేక్షకులను, సంగీత ప్రియులను ఉర్రూతలూగించింది. వీటికి ముందు పవన్ కళ్యాణ్, రానా ప్రచార చిత్రాలు కూడా సామాజిక మాధ్యమాలు వేదికగా సరికొత్త రికార్డులను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది అని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ.

ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను, కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Must Read :‘భీం భీం భీం భీం భీమ్లానాయక్’ అంటూ దూసుకెళుతున్న సాంగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *