Monday, February 24, 2025
Homeసినిమావచ్చేవారంలో నాని సినిమా టీజర్

వచ్చేవారంలో నాని సినిమా టీజర్

Nanis Shyam Singha Roy Teaser Will Be Releasing On November 18th :

న్యాచులర్ స్టార్ నాని హీరోగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న  ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు. రైజ్ ఆఫ్ శ్యామ్ అంటూ ఈ మధ్యే విడుదల చేసిన పాటతో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ ఫస్ట్ సింగిల్‌కు విశేషమైన స్పందన లభించింది. ఈ సినిమా నుంచి మరో అప్ డేట్  వచ్చింది. నవంబర్ 18న ఈ మూవీ టీజర్ రాబోతోందని నిర్మాతలు ప్రకటించారు.

ఈ సంధర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో నాని తన చేతిలో మండుతున్న కర్రను పట్టుకుని ఉన్నారు. నిప్పు కణికలతో పోస్టర్ పవర్ ఫుల్‌గా మారింది. టీజర్ ఎంతో హై ఇంటెన్స్‌ తో ఉండబోతోందని పోస్టర్‌ను బట్టి చూస్తే అర్థమవుతుంది. కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. మెలోడి స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా.. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.జాతీయ అవార్డు గ్రహీత కృతి మహేష్, ప్రతిభా వంతుడైన యశ్ మాస్టర్ ఈ చిత్రంలోని పాటలకు కొరియోగ్రఫర్లుగా పని చేస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. భారీ వీఎఫ్ఎక్స్‌ తో రాబోతోన్న ఈ చిత్రం అన్ని దక్షిణాది భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుంది.

Also Read :  డిసెంబర్ 24న నాని ‘శ్యామ్ సింగ రాయ్’విడుద‌ల‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్