Friday, April 19, 2024
HomeTrending Newsపటిష్టంగా సంపూర్ణ గృహహక్కు: సిఎం

పటిష్టంగా సంపూర్ణ గృహహక్కు: సిఎం

House Registration With Clear Title Cm Suggested The Officials :

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద లబ్ధిదారులకు క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ పథకంపై క్యాంప్‌ కార్యాలయంలో సిఎం జగన్ సమీక్షించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి జాప్యం లేకుండా అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ కూడా నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని చెప్పారు.

సమీక్షలోని ముఖ్యంశాలు:

ఆస్తులపై పూర్తి హక్కులు దఖలు పడతాయని లబ్ధిదారులకు అవగాహన కల్పించాన్న సిఎం

రిజిస్ట్రేషన్ల కోసం తగినన్ని స్టాంపు పేపర్లను తెప్పించుకున్నామన్న అధికారులు

10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామన్న అధికారులు

గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌

లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ నవంబర్‌ 20 నుంచి ప్రారంభం. డిసెంబర్‌ 15 వరకూ రిజిస్ట్రేషన్‌

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలన్న సిఎం

ఇప్పటివరకూ 52 లక్షలమంది ఈ పథకం కింద నమోదు

45.63 లక్షల లబ్ధిదారుదాల డేటాను ఇప్పటికే సచివాలయాలకు ట్యాగ్‌ చేసిన అధికారులు

వీటిపై క్షేత్రస్థాయిలో ఎంక్వైరీలు పూర్తిచేస్తున్న అధికారులు

ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిశీలించి వారికి అప్రూవల్స్‌ ఇస్తున్న అధికారులు

మరో 10 రోజుల్లో పూర్తిస్థాయిలో అప్రూవల్స్‌ ఇస్తామన్న అధికారులు

ఈ సమీక్షా సమావేశానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు,  ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Also Read : జగనన్న శాశ్వత గృహ హక్కు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్