తెలుగు సినిమా మ్యూజిక్ హిస్టరీలో అనూప్ రూబెన్స్ కు ఒక ప్రత్యేక శైలి, స్థానం ఉంటాయి. ‘జై’తో మొదలైన అనూప్ స్వర ప్రస్థానం పదిహేడేళ్లుగా జైత్రయాత్ర సాగిస్తూనే ఉంది. ఫాస్ట్ బీట్, మెలొడీ, ఇన్ స్పైరింగ్ సాంగ్స్, పేట్రియాటిక్, ఫోక్ సాంగ్స్.. ఇలా పాటల కంపోజిషన్ లో అనూప్ టచ్ చేయని జానర్ లేదు. మెప్పించని తరహా లేదు. అప్పట్లో క్యాసెట్ల అమ్మకాల్లో ట్రిపుల్ ప్లాటినం ఫంక్షన్లు చూసిన అనూప్, నేటి డిజిటల్ యుగంలో వందల మిలియన్ వ్యూస్ పాటలను అందించి, మారిన ట్రెండ్ లోనూ మారని తన మ్యూజిక్ టాలెంట్ ను చూపిస్తున్నారు.
తాజాగా నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘బంగార్రాజు’ కు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదలైన ‘లడ్డుండా…’ సాంగ్ నాగార్జున అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులను కూడా అమితంగా ఆకర్షిస్తోంది. ఈ పాటతో మరోసారి అనూప్ తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారని చెప్పొచ్చు.
జై, ధైర్యం నుంచి మొదలైన అనూప్ రూబెన్స్ కెరీర్… ప్రేమ కావాలి చిత్రంతో మరో మలుపు తీసుకుంది. ఇష్క్, లవ్ లీ, గుండెజారి గల్లంతయ్యిందే, పూలరంగడు, మనం, భీమవరం బుల్లోడు, పిల్లా నువ్వు లేని జీవితం, టెంపర్, గోపాల గోపాల… ఇలా రివ్వున పైకి ఎగిరి సంగీత ఆకాశంలో అక్కడే నిలిచిపోయింది. బాలకృష్ణతో పైసా వసూల్, నాగార్జునతో మనం, సోగ్గాడే చిన్ని నాయనా వంటి క్లాస్ హిట్స్ ఇవ్వడం అనూప్ కే సాధ్యమైంది. పవన్ తో ‘గోపాల గోపాల’, ‘కాటమరాయుడు’ చిత్రాలకు బాణీలు అందించారు అనూప్. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ తో ఇదే పాటల వేడుక చేశారు. నీలి నీలి ఆకాశం 274 మిలియన్ వ్యూస్ సాధించి, పాండమిక్ లో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. రీసెంట్ గా ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమాతో హిట్ కొట్టిన అనూప్… త్వరలో మరిన్ని ఛాట్ బస్టర్స్ ఇవ్వబోతున్నారు.
బంగార్రాజుతో పాటు వెంకీతో దృశ్యం-2, రాజశేఖర్ హీరోగా వస్తున్న ‘శేఖర్’ వంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో మన ముందుకు రాబోతున్నారు అనూప్.