Sunday, June 7, 2026
Homeసినిమామ‌హేష్‌ తో ఎన్టీఆర్ ఎపిసోడ్

మ‌హేష్‌ తో ఎన్టీఆర్ ఎపిసోడ్

Mahesh in EMK:
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స్మాల్ స్ర్కీన్ పై ఒక‌ప్పుడు ‘బిగ్ బాస్’ అంటూ సంద‌డి చేశాడు. ఇప్పుడు ‘ఎవ‌రు మీలో కోటీ‌శ్వ‌రులు’ అంటూ మ‌రోసారి సంద‌డి చేస్తున్న‌ విష‌యం తెలిసిందే. ఈ రియాల్టీ షోకు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. మధ్యతరగతి కలలను సాకారం చేయడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ గేమ్‌ షోలో తాజాగా సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు సందడి చేశారు. ఎన్టీఆర్‌ అడిగిన ప్రశ్నలకు మ‌హేష్ బాబు త‌న‌దైన స్టైల్ లో సమాధానాలు ఇచ్చారు.

ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’ గేమ్ షోలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు పాల్గొన్నార‌నే విష‌యం బైటకు వ‌చ్చినప్ప‌టినుంచి ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ ను ప్ర‌సారం చేస్తారా అని అటు నంద‌మూరి అభిమానులు ఇటు ఘట్ట‌మ‌నేని అభిమానులు ఆతృత‌గా ఎదురు చేస్తున్నారు. అయితే.. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్‌ త్వరలో ప్రసారం కానుందని ఈరోజు ప్ర‌క‌టించారు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ.. తాజాగా సదరు ప్రోగ్రామ్‌ టీమ్‌.. ఓ స్పెషల్‌ పోస్టర్‌ని సోష‌ల్ మీడియాలో షేర్‌ చేసింది. పూనకాల ఎపిసోడ్‌ లోడింగ్‌ అని పేర్కొంది. దీంతో నెటిజన్లు.. మేము కూడా ఇక్కడ వెయిటింగ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. త్వ‌ర‌లో ప్ర‌సారం కానున్న ఈ ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ లో ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read :  ‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో కోటి రూపాయల తొలి విజేత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular