Saturday, March 14, 2026
HomeTrending Newsవివాహ వేడుకలో కేసియార్, జగన్

వివాహ వేడుకలో కేసియార్, జగన్

Cms Both Telugu States Met In A Marriage Function : 

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసియార్, జగన్ లు నేడు కలుసుకున్నారు. దీనికి  హైదరాబాద్ నగర శివార్లలో జరిగిన ఓ వివాహవేడుక వేదికైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌ రెడ్డి కుమారుడి వివాహం తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలితో శంషాబాద్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్‌ విఎన్‌ఆర్‌ ఫార్మ్స్‌ లో ఘనంగా జరిగింది.

ఈ వేడుకకు జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్‌ రావు ఇద్దరూ హాజరయ్యారు. ఇరు రాష్ట్రాల సిఎంలతో పాటు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉభయరాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కెసియార్, జగన్ లు కాసేపు ముచ్చటించుకున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి నూతన వధూవరులు రోహిత్‌ రెడ్డి, స్నిగ్ధ రెడ్డిలను ఆశీర్వదించారు.

జల వివాదం తరువాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇద్దరూ కాసేపు ప్రత్యేకంగా భేటి అయినట్లు తెలిసింది.

Also Read : ఏసంగి వడ్ల కోసం ఢిల్లీకి కెసిఆర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular