Monday, March 9, 2026
HomeTrending Newsరెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్

రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్

హత్య కేసులో నిదితుడిగా ఉన్న రెజ్లర్ సుశీల్ కుమార్ ను ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పంజాబ్ లోని జలంధర్ లో అరెస్టు చేశారు. సుశీల్ తో పాటు అతని సన్నిహితుడు అజయ్ కుమార్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఈనెల 4న చత్రసాల్ స్టేడియం వద్ద రెజ్లర్ సాగర్ హత్యకు గురయాడు, అతని మరో ఇద్దరు స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు . సుశీల్, అతని మిత్రులు దాడి చేయడం వల్లే సాగర్ చనిపోయినట్లు ఆరోపణలు వచ్చాయి.  సుశీల్ ఒలిపిక్స్ లో రెండుసార్లు పతకాలు సాధించారు.

ఢిల్లీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సుశీల్ కుమార్ గత 15 రోజులుగా పరారీలో ఉన్నారు.

మే 4న స్టేడియం పార్కింగ్ ఏరియా వద్ద మొదలైన ఓ చిన్న గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది, ఆవేశంలో సుషీల్ సాగర్ ను బలంగా కొట్టాడని, ఈ దెబ్బతో సాగర్ చనిపోయాడని ప్రాధమిక నిర్ధారణలో వెల్లడైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular