We did well:
అధికారం లేకపోతే చంద్రబాబు ప్రతిరోజునూ విషాద దినంగానే భావిస్తారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు ఒక ప్రకృతి విపత్తు అని, దీన్ని మనవ తప్పిదంగా చిత్రీకరించే ప్రయత్నం బాబు చేస్తున్నారని ఆరోపించారు. పైనున్న డ్యామ్ తెగిపోవడంతో అన్నమయ్య ప్రాజెక్టుపై ఒత్తిడి పడిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఊళ్ళను ఖాళీ చేయించిందని రాంబాబు వివరించారు. ఎంతసేపూ పోయిన అధికారాన్ని తిరిగి పొందడానికే చంద్రబాబు అలోచిస్తున్నారు తప్ప ప్రజలకు మేలు చేయాలన్న అలోచన చంద్రబాబుకు లేదని, ఇకపై రాదని ఎద్దేవా చేశారు. ఇటీవల సిఎం జగన్ వరద బాధితుల పరామర్శకు వెళ్ళారని, వారు సిఎం ను ఎంతో ఆప్యాయంగా పలకరించారని, ప్రభుత్వం తీసుకున్న చర్యలను మెచ్చుకున్నారని, దీన్ని కూడా బాబు భరించలేకపోతున్నారని రాంబాబు అన్నారు.
కేంద్ర మంత్రులైనా, ఎవరైనా ఇది ప్రకృతి విపత్తా లేక మనవ తప్పిదమా అనేది తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో మూడు రోజులపాటు విస్తృతంగా పర్యటించిందని, ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారని, అంకితభావంతో, డైనమిక్ గా పనిచేసే సమర్ధులైన అధికారులు ఉన్నారని ప్రశంశించారని రాంబాబు గుర్తు చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇంత బాగా పనిచేసిన అధికారులను కేంద్ర బృందం మెచ్చుకుందని, ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఏర్పాట్లు తాము చూడలేదని ప్రశంశలు కురిపించారని రాంబాబు వివరించారు. వరద ప్రాంతాలకు పరామర్శకు కూడా వెళ్లి తన భార్యను ఎవరో ఏదో అన్నారని సానుభూతి పొందే ప్రచారం చేసుకున్నారని రాంబాబు మండిపడ్డారు.
ఓటిఎస్ పథకంపై కూడా బాబు విమర్శలను రాంబాబు తిప్పికొట్టారు. తాను అధికారంలోకి వస్తే ఉచితంగా ఇస్తానంటున్న బాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. బాబు ఇప్పుడు ఆడుతున్న రాజకీయ వికృత క్రీడకు ఎప్పుడో ఓసారి అయన సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు రాంబాబు.
Also Read : వంచనా శిల్పం