Monday, June 8, 2026
Homeసినిమాతిరుప‌తిలో.. ‘పుష్ప’ మాసీవ్ సక్సెస్ పార్టీ

తిరుప‌తిలో.. ‘పుష్ప’ మాసీవ్ సక్సెస్ పార్టీ

Massive Party:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో రూపొందిన‌ భారీ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప‌’. ‘ఆర్య‌’, ‘ఆర్య-2’ త‌ర్వాత‌ బ‌న్నీ, సుక్కు క‌లిసి చేసిన సినిమా కావ‌డం… ఇద్ద‌రికీ ఇదే ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ కావ‌డంతో పుష్ప సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే పుష్ప భారీ విజ‌యం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో కూడా మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డ్ క‌లెక్ష‌న్స్ సాధించింది.

పుష్ప‌ భారీ విజ‌యం సాధించడంతో పుష్ప మేక‌ర్స్ తిరుప‌తిలో మాసీవ్ సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. తిరుపతి లోని ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో డిసెంబ‌ర్ 21న‌ సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక జరగనుంది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. బ‌న్నీ అభిమానులు ఈ వేడుక‌కు భారీగా త‌ర‌లి రానున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. పుష్ప‌ మూడు రోజుల‌కు 173 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసి 2021లో బిగ్గెస్ట్ గ్రాస‌ర్ గా నిలిచి స‌రికొత్త‌ రికార్డ్ సాధించింది.

Also Read : ‘పుష్ప’ 2 రోజుల గ్రాస్ రూ. 116 కోట్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular