Bhuvaneswari on Assembly incident:
ఆసెంబ్లీ వ్యాఖ్యల విషయంలో తానెంతో బాధపడ్డానని, దాని నుంచి బైటకు రావడానికి తనకు 10రోజులు సమయం పట్టిందని ఏపీ ప్రతిపక్ష నేత, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిదని, అక్కడ తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారని ఆమె గుర్తు చేశారు.
ఆడపిల్లలంటే ఆట వస్తువులు కాదని, పనిలేక మాపై విమర్శలు చేస్తున్నారని ఆమె వైసీపీ నేతలనుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. సమాజానికి ఉపయోగం లేని విమర్శలెందుకని ఆమె ప్రశ్నించారు. అతి పెద్ద రాష్ట్రాన్ని తన భర్త ఏ విధంగా అభివృద్ధి చేశారో తెలుసన్నారు. రాష్ట్రం కోసం రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు.
రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉండాలి, ఉంటుందని భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. నా భర్త పనితీరు ఏంటో ప్రజలకు తెలుసని, వైసీపీ నేతల విమర్శలను పట్టించుకోమని, వాటి గురించి బాధ పడాల్సిన అవసరం అసలే లేదన్నారు. ప్రజాసేవకే అంకితమవుతామని ఆమె వివరించారు.
Also Read : భోరున విలపించిన బాబు

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.