Saturday, November 23, 2024
Homeసినిమాగర్వంగా ఫీల్ అవుతున్నాను - రాధాకృష్ణ కుమార్

గర్వంగా ఫీల్ అవుతున్నాను – రాధాకృష్ణ కుమార్

రెబ‌ల్ స్టార్ డా. యు.వి. కృష్ణంరాజు స‌మ‌ర్పణ‌లో గ్లోబల్ స్టార్ ప్రభాస్, గాడ్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా న‌టించిన చిత్రం రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్ధలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. వంశీ, ప్రమోద్, ప్రసీధ‌లు ఈ పాన్ ఇండియా సినిమాకు నిర్మాత‌లుగా వ్యవ‌హ‌ రిస్తున్నారు. జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

హిందీ వెర్షన్ కు మిథూన్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ ల‌వ్లీ విజువ‌ల్ వండ‌ర్ ని ఏక‌కాలంలో ఐదు భాష‌ల తో పాటు చైనీస్, జపనీస్ భాషల్లోనూ భారీ రేంజ్ లో విడుదల చేస్తున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలతో జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా రాధే శ్యామ్ టెక్నిసిషన్స్ డి.ఓ.పి. మనోజ్ పరమహంస, ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్, చిత్ర దర్శకుడు రాధా కృష్ణ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ జ‌స్టిన్ ప్రభాక‌ర‌న్ లు మీడియాతో ముచ్చటించారు.

చిత్ర దర్శకుడు రాధా కృష్ణ కుమార్ మాట్లాడుతూ “మా నిర్మాత కృష్ణంరాజు గారు మాకు బాగా సపోర్ట్ గా నిలిచారు. ట్రైలర్ చూసిన వారంతా ట్రైలర్ లో వి.యఫ్.ఎక్స్ బాగుంది అంటున్నారు. ఈ క్రెడిట్ అంతా కమల్ కన్నన్ కె దక్కుతుంది. నాకు ఇన్స్పిరేషన్ చంద్ర శేఖర్ యేలేటి, ప్రభాస్ గార్లే. ప్రభాస్ గారిని నేను ఎంతో ఇష్టపడతాను. ఇది 1970 లలో సాగే పీరియాడిక్ మూవీ. నిర్మాతలు మాకు ఏం కావాలంటే అది అందించారు. గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమా చేయడం దర్శకుడుగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చంటి గారు మాకు బ్యాక్ బోన్ గా నిలిచారు. 5 భాషల్లో తీయడం అంటే గొప్ప విషయం. సంక్రాంతి శుభాకాంక్షలతో జనవరి 14 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్నారు.

డి.ఓ.పి. మనోజ్ పరమహంస మాట్లాడుతూ “చిత్ర నిర్మాతలకు ఈ స్టోరీ బాగా నచ్చడంతో ఈ స్క్రిప్ట్ కు ఏం కావాలో చెప్పమంటూ.. ప్రతి సీన్లో ఒక షాట్ అద్భుతంగా రావాలని నా మీద భారం పెట్టారు. ఒక్కక్క షాటే కాదు, సినిమా మొత్తం అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాను అనేక దేశాల్లో చిత్రీకరించడం వలన ప్రేక్షకులకు వండర్ఫుల్ విజువల్ ఫీస్ట్ అవుతుంది. రాధా గారు మోస్ట్ ఇంటలెక్చువల్ పర్సన్. ఈ మూవీ అందరికీ సంథింగ్ స్పెషల్ గా నిలుస్తోంది. ఇటలీ లో చేసిన షూట్ కు ఇటలీ ఆర్ట్ డైరెక్టర్ తోనే వర్క్ చేశాం. ప్రతి ఫ్రేమ్ కరెక్ట్ గా ఉండేలా ఆర్ట్ డైరెక్టర్స్ చాలా కష్టపడ్డారు. హాలీవుడ్ లో పెద్ద సినిమాలు చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ నిక్ పాల్ మాతో 3 ఇయర్స్ జర్నీ చేయడం చాలా సంతోషం. ఈ సినిమాలోని పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రాధే శ్యామ్ టీంలో నేను భాగం అయినందుకు గర్వంగా ఉంది. అలాగే నాకీ అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్