Tuesday, June 9, 2026
Homeసినిమామూడో షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'రుద్రాక్షపురం'

మూడో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘రుద్రాక్షపురం’

Suresh Kondeti New experience: మ్యాక్ వుడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై  నాగమహేశ్, రాజేంద్ర, జీవ, సాయి మణితేజ, వైడూర్య, పవన్ వర్మ, సునిత, రేఖ, రాజేశ్ రెడ్డి, వీరబాబు, సురేష్ కొండేటి, ఆనంద్, అక్షర నిహా నటీనటులుగా ఆర్ కె గాంధీ దర్శకత్వంలో కొండ్రాసి ఉపేందర్, కనకదుర్గ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం”రుద్రాక్షపురం“.విజయవంతంగా మూడవ షెడ్యూల్ పూర్తి చేసుకొని నాలుగవ షెడ్యూల్ కు అనంతపురం వెళుతుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆర్ కె గాంధీ మాట్లాడుతూ “కన్నడలో 3 మూవీస్ చేశాను. తెలుగులో ప్రేమ భిక్ష చేశాను. ‘రుద్రాక్షపురం’ రెండవ చిత్రం. నిర్మాత ఉపేందర్ రెడ్డి గారికి కథ చెప్పగానే ఓకె చేశారు. ఇందులో సినిమా వాళ్ళ కథలు, వ్యధలు ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ఇండస్ట్రీ అంటే తపన వుండే వారికి అవకాశం ఇవ్వాలి. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఒక పాట, ఫైట్ మిగిలి ఉంది. ఈ ఫైట్ ను థ్రిల్లర్ మంజు చేస్తున్నారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ “సినిమా ఇండస్ట్రీ అనేది అందరికీ అవకాశం ఇవ్వడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఈ ఇండస్ట్రీలో మాత్రమే ఆఫీస్ బాయ్ కూడా స్టార్ హీరో అయ్యే అవకాశం ఉంది. అందరికి అద్భుతమైన లైఫ్ ఇచ్చే కళామతల్లి సినీ పరిశ్రమ. నాకు గాంధీ గారు కథ చెప్పగానే నచ్చింది. లొకేషన్ కి వెళ్ళేసరికి నాతో ఫైట్లు కూడా ప్లాన్ చేశారు, నేనే ఆశ్చర్యపోయాను. ఇప్పటివరకు నేను కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఫైట్స్ చెయ్యలేదు. 20 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ అందరినీ దగ్గరనుండి చూశాను. ప్రొడ్యూసర్ గా కూడా నేను కొన్ని సినిమాలు చేసి ఉన్నాను. నాకు ఈ బ్యానర్ లో నటించడం చాలా కంఫర్ట్ అనిపించింది ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular