Saturday, November 23, 2024
HomeTrending Newsకేసీఆర్ అసమర్థతతో రైతులకు కష్టాలు

కేసీఆర్ అసమర్థతతో రైతులకు కష్టాలు

టీఆరెఎస్ బీజేపీ లు ముందు నుంచి కలిసే ఉన్నాయని, ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో ఆరోపించారు. పార్లమెంట్ లో ప్రతి బిల్లుకు టీఆరెఎస్  మద్దతు ఇచ్చిందని, సింగరేణి కాలరీస్ కు అనుకొని ఉన్న మైనింగ్ ప్రవేట్ పార్టీకి ఆప్షన్ ఇచ్చారని గుర్తు చేశారు. దీనిపై టీఆరెఎస్ ప్రభుత్వం నోరు మెదపలేదని, నేను ఈ అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించాను అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి  తిరిగి సింగరేణికి కేటాయించాలని కోరానని తెలిపారు. నా ప్రశ్నకు సంబంధిత మంత్రి ఈ నిర్ణయంపై పునసమిక్షిస్తామని లోక్ సభలో సమాధానం ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ అసమర్థత వల్ల రాష్ట్ర రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, రైతులు టీఆరెఎస్ పార్టీని బొందపెట్టడం ఖాయమన్నారు. వరి వేయొద్దని కేసీఆర్ మైండ్ లేకుండా మాట్లాడుతున్నారని, పంట మార్పిడి జరగాలంటే  దానికి రైతులను సమాయత్తం చేయాలని సూచించారు. అలా కాకుండా సడన్ గా వరి వేయొద్దని చెప్పడం అవగాహన రాహిత్యమని, టీఆరెఎస్ నేతలు సన్నాసులు .. దద్దమ్మలని ఉత్తమ్ కుమార్ ఎద్దేవా చేశారు.

కేసీఆర్ అసమర్థత వల్లనే  రైతులు మద్దతు ధర కంటే తక్కువ ధరకు వడ్లు అమ్ముకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఆలస్యంగా ఓపెన్ చేసిందని, రైతుల ఉసురు కేసీఆర్ కు తగులుతుందన్నారు. రాష్ట్రంలో పండిన ప్రతిగింజ కొంటామనీ అసెంబ్లీలో కేసీఆర్ చెప్పాడని, ఇప్పుడేమో ఒక్క గింజా కొనను అంటున్నాడని మండిపడ్డారు. ఇది కేసీఆర్ మూర్ఖత్వానికి నిదర్శనమని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయని, దేశంలో అన్ని రాష్ట్రాల్లో వడ్లను కొంటున్న కేంద్రం .. తెలంగాణ లో మాత్రం ఎందుకు బియ్యం కొనుగోలు చేస్తుందని ఉత్తమ్ కుమార్ అడిగారు.

కేంద్రం ఇచ్చిన మద్దతు ధర రైతుల కోసమా .. మిల్లర్ల కోసమా ..అన్న ఉత్తమ్ కుమార్ రాష్ట్రంలో రైతులపై అక్షలు సరికాదు .. రైతులు ఏ పంట వేయాలనుకుంటే అదే పంట వేసుకోండని పిలుపు ఇచ్చారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇచ్చినట్లుగా ప్రతి కింటాలు కు 5 వందలు కేటాయించాలని, రాష్ట్రంలో 5 వేల కోట్లు కేటాయిస్తే అసలు సమస్యే ఉండదన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ రైతుల కోసం 5 వేల కోట్లు కేటాయించాలని ఉత్తమ్ కుమార్ డిమాండ్ చేశారు. రెండు లక్షల బడ్జెట్ కేసీఆర్ విలాసాల కోసమా, కాంగ్రెస్ నిరంతరం రైతులకు అండగా ఉంటుందని ..రైతు ప్రయోజనాల కోసం పోరాటం చేస్తామని ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు.

Also Read : బీజేపీ దీక్ష అంటే కేసీఆర్ కు వణుకు

RELATED ARTICLES

Most Popular

న్యూస్