Tuesday, April 16, 2024
HomeTrending Newsరైతులను రెచ్చగొడుతున్న విపక్షాలు

రైతులను రెచ్చగొడుతున్న విపక్షాలు

 Minister Niranjan Reddy : దేశంలో రైతులకు, వ్యవసాయానికి గౌరవాన్ని పెంచింది కేసీఆర్ అని అందరూ వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తే.. వ్యవసాయానికి కేసీఆర్ వన్నె తెచ్చారని వ్యవసాయ శాఖ మంత్రి  నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా కొందరు వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో వ్యవసాయాన్ని అగ్రభాగాన నిలిపింది తెలంగాణ ప్రభుత్వమన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఖర్చు చేస్తోందని ఈ రోజు హైదరాబాద్ లో తెలిపారు. 60 వేల కోట్లు ప్రతీ ఏడాది రైతుల కోసం ఖర్చు చేస్తోందని, వ్యవసాయ ఉత్పత్తుల సగటులో దేశంలో తెలంగాణ నంబర్ వన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే రాష్ట్రంలో రైతులకు కష్టాలు వచ్చాయని, విత్తనాల కోసం, మిల్లర్ల ఒప్పందంతో వరి వేసుకుంటే ఇబ్బంది లేదు. కొనుగోలు కేంద్రాలు పెట్టమని మంత్రి మరోసారి స్పష్టం చేశారు.

పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి పై ఏకవచన సంబోధన సరికాదని, విత్తనాల కోసం కేసీఆర్ ఫామ్ హౌజ్ లో వరి వేశారని మంత్రి పేర్కొన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం వరి పంట వేసుకున్నారు. దాని వల్ల ఎవరికి నష్టం లేదన్నారు. టీపీసీసీ ఢిల్లీలో యుద్ధం చేయాలని హితవు పలికిన మంత్రి కాంగ్రెస్ నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదన్నారు. 40లక్షల 4వేల పైచిలుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండాల్సి ఉంటే 31లక్షల 30 వేల మంది ఉద్యోగులే ఉన్నారని, 8లక్షల పైచిలుకు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు.

రైతుల్ని రెచ్చగోడతారా? మీకు భాద్యత లేదా అన్న మంత్రి నిరంజన్ రెడ్డి గ్రామాల్లో లక్ష్మీ కళకళలాడుతోందన్నారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడే రాజకీయాలు ఆపండని విపక్ష నేతలను కోరారు. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. ఇప్పుడు బండి సంజయ్ దీక్ష చేయడం అర్థం లేనిదని మండిపడ్డారు. బండి సంజయ్ ఢిల్లీలో పోయి ఏడువు. కేంద్రాన్ని ఒప్పించి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇప్పించండని మంత్రి హితవు పలికారు.

Also Read : కేంద్రంపై తెలంగాణ మంత్రుల ఫైర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్