India Vs. SA: సెంచూరియన్ టెస్ట్ ఆసక్తికరమైన మలుపు తిరిగింది. విజయానికి ఇండియా ఆరు వికెట్ల దూరంలో ఉండగా సౌతాఫ్రికా 211 పరుగులు చేయాల్సి ఉంది. ఇండియా రెండో ఇన్నింగ్స్ లో 174 పరుగులకు ఆలౌట్ అయ్యి సౌతాఫ్రికా ముందు 305 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. బుమ్రా రెండు, సిరాజ్, షమీ చెరో వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ అర్ధసెంచరీ (52) సాధించి అజేయంగా నిలిచాడు.
రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ నష్టాపోయి 16 పరుగులు ఓవర్ నైట్ స్కోరుతో నేటి ఆట మొదలు పెట్టిన ఇండియా బ్యాట్స్ మెన్ లో రిషభ్ పంత్ (34) ఒక్కడే అత్యధిక స్కోరర్. రాహుల్-23 ; రెహానే-20 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడ, మార్కో జెన్సన్ చెరో నాలుగు, నిగిడి రెండు వికెట్లు సాధించారు.
Also Read : సౌతాఫ్రికా 197 ఆలౌట్, షమీకి ఐదు వికెట్లు