31న వస్తున్న సోని అగర్వాల్‌ ‘డిటెక్టివ్‌ సత్యభామ’

Detective Satyabhama: సిన్మా ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై శ్రీశైలం పోలెమోని నిర్మాతగా నవనీత్‌ చారి దర్శకత్వంలో సోనీ అగర్వాల్‌ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్‌ సత్యభామ’. ప్రపంచవ్యాప్తంగా ఈనెల డిసెంబర్ 31న సుమారు 500 థియేటర్స్ లలో విడుదల చేస్తున్నారు. డిటెక్టివ్‌ సత్యభామ ట్రైలర్ ను నిర్మాత పోలెమోని శ్రీశైలం విడుదల చేశారు. అలాగే ఇందులోని మొదటి పాటను రాజ పోలెమోని విడుదల చేయగా, నటి సునీత పాండే రెండవ పాటను, సినీ పి.ఆర్.ఓ ఆర్.కె. చౌదరి మూడవ పాటను, నటి శివ జ్యోతి నాలుగవ పాటను, నటుడు మురళి ఐదవ పాటను విడుదల చేశారు.

చిత్ర నిర్మాత శ్రీశైలం మాట్లాడుతూ “ప్రతి ఒక్కరూ నా సినిమా అనుకొని చాలా కష్టపడ్డారు. సోనీ అగర్వాల్ ఈ సినిమాలో చాలా చక్కగా నటించారు.7 జి బృందావనం చేసినప్పటి ఫ్యాన్స్ ఇప్పడు వస్తున్న ఈ సినిమా విడుదల కోసం ఇంకా ఎదురు చూస్తుండం గొప్ప విషయం. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా అన్ని హంగులతో తీర్చి దిద్దాం. స్క్రీన్ మాక్స్ ప్రసాద్ గారు మా చిత్రాన్ని విడుదల చేస్తున్నందుకు ధన్యవాదాలు. మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలి” అన్నారు.

చిత్ర దర్శకుడు నవనీత్‌ చారి మాట్లాడుతూ “నేను చెప్పిన కథను నిర్మాత శ్రీశైలం నమ్మి నాకీ అవకాశం ఇచ్చారు. ఇందులో నటించిన వారంతా నేను అనుకున్న దాని కంటే ఎక్కువ చేశారు. టెక్నిషియన్స్ అందరూ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారు. ఎవ్వరూ ఊహించని ట్విస్టులు ఇందులో ఉంటాయి. ఇందులోని పాటలు చాలా బాగుంటాయి. సోనీ అగర్వాల్ యాక్షన్స్ సీన్స్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటాయి. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో ఈ నెల 31 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధిస్తుంది” అని విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *