7.1 C
New York
Saturday, December 2, 2023

Buy now

Homeసినిమాఆ సంఘ‌ట‌న‌లే ‘అర్జున ఫల్గుణ’కు స్పూర్తి : శ్రీవిష్ణు

ఆ సంఘ‌ట‌న‌లే ‘అర్జున ఫల్గుణ’కు స్పూర్తి : శ్రీవిష్ణు

Arjuna-Phalguna: శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం అర్జున ఫ‌ల్గుణ‌. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. తేజ మార్ని ద‌ర్శక‌త్వం వ‌హించిన‌ ఈ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో హీరో శ్రీ విష్ణు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయ‌న మాట‌ల్లోనే..

ఈ ఏడాదిలో నాకు ఇది మూడో చిత్రం. కొత్త దర్శకులనే నేను ఎంచుకుంటూ వచ్చాను. మంచి కథతో దర్శకులు వస్తే.. అన్నీ దగ్గరుండి నేనే చూసుకుంటాను. నాకు మొదటి సారి తేజ మార్నిలో దర్శకుడు కనిపించాడు. బాగా హ్యాండిల్ చేయగలడని నాకు నమ్మకం కలిగింది. ఎమోషన్ సీన్స్ బాగా రాశాడు. ఎమోషనల్ హ్యాండిల్ చేయగలిగితే సినిమా వర్కవుట్ అవుతుంది. అందుకే సినిమాను ఓకే చేశాను. చాలా తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసి నాకు షాక్ ఇచ్చాడు. 55 రోజుల్లో షూట్ చేయడం చాలా కష్టం. చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు.

అర్జున ఫల్గుణ అనేది భారతంలోని టాపిక్. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటీ, కృష్ణ, విజయ, ఇలా.. ఓ పది పేర్లు తలుచుకుంటూ ధైర్యం వస్తుందని పురాణాల్లో చెప్పారు కానీ.. రాను రాను అది అర్జున ఫల్గుణ వరకే చెప్పారు. ఉరుములు మెరుపులు పిడుగులు వస్తే అందరూ అర్జున ఫల్గుణ అని అనుకునేమనేవారు కానీ.. కొన్ని పేర్లు విన్నప్పుడు, తలుచుకున్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది. అలా అర్జున ఫల్గుణ అనే పేరులో ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ సినిమాకు ముందుగా వేరే పేరు అనుకున్నాం కానీ అది కుదరలేదు. ఒక రోజు వర్షంలో కూర్చుని డైరెక్టర్, నేను మాట్లాడుకున్నాం. అలా ఈ టైటిల్ వచ్చింది.

మేం ఐదుగురం ఫ్రెండ్స్. ఆ పేర్లలో ఫస్ట్ లెటర్స్‌ తో ఆర్టాస్ అని వస్తుంది. ఇంతకు ముందు అయితే ఆర్టాస్ కూల్‌డ్రింక్‌ కంపెనీలో పని చేసే కుర్రాళ్ల కథ. కానీ అది కుదరలేదు. అందుకే సోడా మీదకు కథ మార్చేశాం. డిగ్రీ అయిపోయి ఊర్లోనే ఉంటూ సంపాదించుకుందామనే కుర్రాళ్ల కథ. సిటీకి వెళ్లి పాతిక వేలు సంపాదించేకంటే.. ఊర్లో ఉండి పది వేలు సంపాదించుకుని తల్లిదండ్రులను బాగా చూసుకుంటే చాలని అనుకునే మనస్తత్వంతో ఉంటారు. ఇది వరకు చాలా సినిమాల్లో ఈ యాసలో మాట్లాడాను కానీ.. ఇప్పుడు పూర్తిగా గోదావరి యాసలోనే ఉంటుంది. ఇది కరెక్ట్ స్లాంగ్. ఈ సినిమాలో యాస పరంగా ఎలాంటి హద్దుల్లేవు. పూర్తిగా ఎటకారంగా ఉంటుంది.

తెలుగు హీరోలందరినీ నేను ఆరాధిస్తాను. అందరినీ ఇష్టపడతాను. పెద్ద ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలా అందరినీ నేను గొప్పగా చూస్తుంటాను. మన హీరోలను గౌరవించుకునే అవకాశం వస్తే నేను దాన్ని వాడుకుంటాను. వాళ్లంతా గొప్ప వాళ్లు కాబట్టే స్టార్లు అయ్యారు. నాకు ఈ సినిమాలో ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం వచ్చింది. ఇందులో ఎంతో పాజిటివ్‌గా ఉంటుంది. యథార్థ సంఘటనలే కానీ దాన్ని గోదావరి జిల్లాకు అడాప్ట్ చేశాం. నర్సీపట్నంలో జరిగిన ఘటనల ఆధారంగానే ఈ సినిమాను తీశాం.

నిర్మాత నిరంజన్ రెడ్డి గారు వైల్డ్ డాగ్, ఆ తరువాత ఆచార్య మధ్యలో మేం. కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. ఎప్పుడూ కూడా ఆయన మమ్మల్నీ ఏమీ అడగలేదు. ఆయన మమ్మల్ని చాలా నమ్మారు. ‘భళా తందనాన’ అనే సినిమా చేస్తున్నాను. లక్కీ మీడియాలో మరో చిత్రం చేస్తున్నాను. భళా తందనాన పెద్ద స్పాన్ ఉన్న సినిమా. మంచి యాక్షన్ డ్రామా. లక్కీ మీడియాలో చేస్తోన్నది పోలీస్ ఆఫీసర్ బయోగ్రఫీ. ఇందులో ఐదు ఏజ్ గ్రూపులుంటాయి.

Also Read : ‘అర్జున ఫల్గుణ’ సంక్రాంతిని ముందే తెస్తుంది : డైరెక్టర్ తేజ మర్నీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్