Mahmudul Hasan half Century: న్యూజిలాండ్ తో బే ఓవల్ మైదానంలో జరుగుతోన్న మొదటి టెస్టులో బంగ్లాదేశ్ కూడా దీటుగా ఆడుతోంది. గత నెలలోనే టెస్టు క్రికెట్ లో ఆరంగ్రేటం చేసిన మహ్ముదుల్ అర్ధ సెంచరీ (70)తో అజేయంగా నిలిచి రాణించాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లకు 175 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లకు 258 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేటి ఆటను కీవీస్ ప్రారంభించింది. నిన్న 32 పరుగులు చేసిన హెన్రీ నికోల్స్ 75పరుగులు చేసి ఔటయ్యాడు. నిన్నటి స్కోరుకు మరో 70 పరుగులు జోడించి కీవీస్ ఆలౌట్ అయ్యింది. బంగ్లా బౌలర్లలో శోరిఫుల్ ఇస్లామ్, మేహిది హసన్ చెరో మూడు, కెప్టెన్ మొనిముల్ హక్ రెండు; ఈ హుస్సేన్ ఒక వికెట్ పడగొట్టారు.
బంగ్లాదేశ్ మొదటి వికెట్ కు 43 పరుగులు చేసింది. 22 పరుగులు చేసిన షాద్ మాన్ ఇస్లాం, వాగనర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. మహ్ముదుల్ హసన్, నజ్ముల్ హుస్సేన్ రెండో వికెట్ కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 64 పరుగులు చేసిన నజ్ముల్ వాగ్నర్ బౌలింగ్ లోనే ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మహ్మదుల్ హసన్-70, కెప్టెన్ హక్-7 పరుగులతోను క్రీజులో ఉన్నారు.