Friday, March 29, 2024
Homeసినిమాశ్రీవిష్ణు హీరోగా టింబు ప్రొడ‌క్ష‌న్ చిత్రం

శ్రీవిష్ణు హీరోగా టింబు ప్రొడ‌క్ష‌న్ చిత్రం

Sri Vishnu – New film: వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ.. విజ‌యాలు సాధిస్తూ.. త‌న‌కంటూ ఓ గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యువ‌ కథానాయకుడు శ్రీవిష్ణు త్వరలో మరో విభిన్న కథా చిత్రంలో నటించబోతున్నాడు. ఆయన హీరోగా నటించనున్న ఈ చిత్రాన్ని టింబు ప్రొడక్షన్స్‌ పతాకం పై వేదరాజ్‌ టింబర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం చ‌ర్చలు జ‌రుగుతున్నాయి. నూత‌న సంవ‌త్సరం సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని ప్రక‌టించారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ… శ్రీ విష్ణు హీరోగా మా సంస్థలో ప్రొడక్షన్‌నెం.4గా ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఫిబ్రవరి మొదటి వారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. గతంలో మా సంస్థలో అల్లరి నరేష్‌ హీరోగా మడతాకాజా చిత్రంతో పాటు సంఘర్షణ అనే చిత్రాన్ని నిర్మించాం. ఈ తాజా చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్