Sunday, June 7, 2026
Homeసినిమా21న ఐదు భాషల్లో ‘వర్మ' (వీడు తేడా) విడుద‌ల‌

21న ఐదు భాషల్లో ‘వర్మ’ (వీడు తేడా) విడుద‌ల‌

Varma-Veddu Tedaa: నట్టి క్రాంతి హీరోగా ఐదు భాషల్లో రూపొందిన చిత్రం ‘వర్మ’ (వీడు తేడా). ఇందులో నట్టి క్రాంతి సరసన హీరోయిన్లుగా ముస్కాన్, సుపూర్ణ మలాకర్, సందడి చేస్తున్నారు. నట్టి కుమార్ దర్శకత్వం వహించారు. క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ అండ్ నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాల పై శ్రీమతి నట్టి లక్ష్మి, శ్రీధర్ పొత్తూరి సమర్పణలో నిర్మాత నట్టి కరుణ నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం వంటి ఐదు భాషలలో రూపొందించిన ఈ చిత్రాన్ని జనవరి 21న భారీగా విడుదల చేయనున్నట్లు నిర్మాత నట్టి కరుణ తెలిపారు.
తొలుత ఈ చిత్రానికి  ‘సైకో వర్మ” అనే టైటిల్ పెట్టాం కానీ.. సైకో అనే పదానికి సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ పదాన్ని టైటిల్ లో తీసివేశామని నిర్మాత నట్టి కరుణ వివరించారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ సాంగ్, థీమ్ మ్యూజిక్ లకు, అలాగే మోషన్  పోస్టర్లకు విశేషమైన స్పందన లభించిందని కరుణ తెలిపారు. కాగా ఈ చిత్రానికి సంబందించిన ‘మనసే పిచ్చిది అయినదే’ అనే లిరికల్ వీడియో సాంగ్ ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదల కానున్నట్లు నిర్మాత తెలిపారు.

నట్టికుమార్  మాట్లాడుతూ… ఓ సాఫ్ట్ వేర్ కుర్రాడి జీవితంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతూ… యదార్థ సంఘటనల ప్రేరణతో సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంటుంది. హీరో నట్టి క్రాంతి తన పాత్రకు ప్రాణం పోశాడని, పాటలు కూడా అలరిస్తాయని చెప్పారు. చిత్రం అన్నివిధాలుగా చాలా బాగా వచ్చిందని    అన్నారు.

Also Read : నిర్వాసితుల దీక్షలు పట్టించుకోరా? లోకేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular