Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్తొలి వన్డేలో విండీస్ విజయం

తొలి వన్డేలో విండీస్ విజయం

వెస్టిండీస్- ఐర్లాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో విండీస్ 24 పరుగులతో విజయం సాధించింది. మూడు వన్డేలు, ఒక టి 20 మ్యాచ్ సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్ జట్టు వెస్టిండీస్ లో పర్యటిస్తోంది. జమైకా, కింగ్ స్టన్ సబీనా పార్క్ స్టేడియం వేదికగా జరిగిన తొలి వన్డేలో ఐర్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 18 పరుగులకే విండీస్ తొలి (జస్టిన్ గ్రీవ్స్-7) వికెట్; 59 పరుగుల వద్ద రెండు వరుస వికెట్లు (పూరన్-13, షాయ్ హోప్-29) కోల్పోయింది. ఆ వెంటనే రోస్టన్ ఛేజ్(1) కూడా ఔటయ్యాడు. 62  పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ పోలార్డ్, షమ్రా బ్రూక్స్ లు ఐదో వికెట్ కు 155 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి ఆదుకున్నారు. పోలార్డ్-69 (66 బంతులు, 4 ఫోర్లు, 4సిక్సర్ల ) చేసి ఔటయ్యాడు.  ఆ తర్వాత కాసేపటికే బ్రూక్స్-93 (89 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా ఔటయ్యాడు. చివర్లో ఓడియన్ స్మిత్ 8 బంతుల్లో 2 సిక్సర్లు, ఒక ఫోర్ తో 18 పరుగులు రాబట్టాడు. 48.5 ఓవర్లలో 269 పరుగులకు విండీస్ ఆలౌట్ అయ్యింది.  ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్, క్రెగ్ యంగ్ చెరో మూడు; అండీ మెక్ బ్రిన్ రెండు, జోషువా లిటిల్, కర్టిస్ క్యాంపెర్ చెరో వికెట్ తీసుకున్నారు.

270 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ ఒక పరుగు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. విలియం  పోర్టర్ ఫీల్డ్ డకౌట్ అయ్యాడు. కెప్టెన్ బాల్ బిర్ని-71; హ్యారి టెక్టర్-53 ; ఆండీ మెక్ బ్రిన్-34 పరుగులతో రాణించాడు. చివర్లో మార్క్ అడైర్ 9 బంతుల్లో 3 సిక్సర్లతో 21 పరుగులు చేసినప్పటికీ సహచరుల నుంచి సరైన సహకారం లేకపోవడంతో 49.1 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మెక్ బ్రిన్ గాయం కారణంగా రిటైర్ హర్ట్ గా వెనుదిరిగాడు.

విండీస్ బౌలర్లలో జోసెఫ్, షెఫర్డ్ చెరో మూడు; ఓడియన్ స్మిత్ రెండు; హోల్డర్, హుస్సేన్ చెరో వికెట్ తీసుకున్నారు.

షమ్రా బ్రూక్స్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్