రాజీనామా చేసి గెలవండి: రోజా సవాల్

Roja on Babu: కుప్పంలో మళ్లీ గెలుస్తానన్న నమ్మకం ఉంటే తెలుగుదేశం పార్టీ అధక్షుడు చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సవాల్ విసిరారు. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా మీడియాతో మాట్లాడుతూ కుప్పంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమని టిడిపి ప్రగల్భాలు పలకడం కాదని దమ్ముంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే చంద్రబాబుతో సహా అందరి సరదా సీఎం జగన్ తీర్చేస్తారని వ్యంగ్యంగా అన్నారు.

స్థానిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత చంద్రబాబు కుప్పం చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. 30 ఏళ్ల తర్వాత కుప్పంలో ఇల్లు కట్టుకోవాలని చంద్రబాబుకి తెలిసి వచ్చిందా అని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నతుందని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు కుప్పం కు నీల్లివ్వలేకపోయారని రోజా విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *