Christchurch  Test: బంగ్లాదేశ్ తో స్వదేశంలో జరిగిన మొదటి టెస్టులో ఘోర పరాజయం తర్వాత న్యూజిలాండ్ జట్టు కోలుకొని రెండో టెస్టులో సత్తా చాటుతోంది.  తొలి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ నష్టానికి 349 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్(186) డబుల్ సెంచరీకి చేరువలో ఉండగా డెవాన్ కాన్వె (99) సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు.

క్రైస్ట్ చర్చ్ లోని హాగ్లీ ఓవల్ మైదానంలో జరుగుతోన్నఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు లాథమ్- యంగ్ లు తొలి వికెట్ కు 148 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు, 54 పరుగులు చేసిన యంగ్, షోరిఫుల్ ఇస్లామ్ బౌలింగ్ లో నయీమ్ పట్టిన క్యాచ్ కు ఔటయ్యాడు. తర్వాత లాథమ్- డెవాన్ కాన్వెలు రెండో వికెట్ కు 201 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.

లాథమ్ సాధించిన 186 పరుగుల్లో 112  పరుగులు ఫోర్ల (28) ద్వారా లభించడం విశేషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *