యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని జీయర్ స్వామి ఆశ్రమానికి ఈ రోజు వేంచేశారు.
మార్చి 28న మహా కుంభసంప్రోక్షణం చేపట్టాలని, 21 నుంచి మహా సుదర్శనయాగం నిర్వహించాలని ఇప్పటికే ముహూర్తం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు, ఆహ్వానాలు, సంబంధిత అంశాలపై జీయర్ స్వామితో సీఎం సమావేశమై చర్చించారు.
ఫిబ్రవరిలో జీయర్ ఆశ్రమంలో రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ, సంబంధిత ఏర్పాట్లపై కూడా సీఎం చర్చించారు. ఈ సందర్భంగా ఆశ్రమ రుత్వికులు సీఎం కేసీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఆశ్రమంలోని యాగశాలకు వెళ్లిన ముఖ్యమంత్రికి …అక్కడ ఏర్పాట్లపై చినజీయర్ స్వామి వివరించారు. సీఎంతో పాటు మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్, మైం హోం అధినేత రామేశ్వరరావు ఉన్నారు.