Saturday, November 23, 2024
HomeTrending Newsఏ సమస్యలు లేవా? ప్రభుత్వంపై కేశవ్ విసుర్లు

ఏ సమస్యలు లేవా? ప్రభుత్వంపై కేశవ్ విసుర్లు

PAC meet on Solar Power: వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్లపై పెట్టిన శ్రద్ధ రైతులపై పెట్టాలని తెలుగుదేశం ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ సూచించారు. రాష్ట్రంలో ఏ సమస్యా లేనట్లు సినిమాలపై చర్చిస్తున్నారని మండిపడ్డారు. రైతుల జీవితాల్లో సినిమా కష్టాలను మించిన సమస్యలున్నాయని, వాటి గురించి ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీ కమిటీ హాల్ పబ్లిక్ అకౌంట్స్ కమిటి సమావేశం కేశవ్ అధ్యక్షతన జరిగింది. పీఏసీ భేటీలో విద్యుత్ కొనుగోళ్ళపై చర్చ జరిగిందని, కోవిడ్ కారణంగా సంబంధిత అధికారి సమావేశానికి హాజరు కాలేదని కేశవ్ వెల్లడించారు. కమిటీకి ఇవ్వాల్సిన సమాచారాన్ని కూడా అయన ఇవ్వలేదనన్నారు. అజెండాకు ఇవ్వాల్సిన సమాచారాన్ని ఇవ్వకపోవడాన్ని పిఏసీ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు.

విద్యుత్ కొనుగోళ్ళు, ప్రభుత్వ సబ్సిడీలపై సమావేశంలో వాడీ వేడి చర్చ జరిగినట్లు తెలిసింది. సోలార్ విద్యుత్ కొనుగోళ్లలో లోపాలను కేశవ్ ప్రస్తావించారు. సెకి టెండర్లను 2.49 రూపాయలకే ఖరారు చేయడంపై ఆరా తీశారు, కచ్చితంగా అంతే అవుతుందా లేక ఎక్కువ ఖర్చు అవుతుందా అంటూ అధికారులపై ప్రశ్నలు సంధించారు. సరైన సమాచారంతో మళ్ళీ వస్తామని అధికారులు చెప్పడంపై పయ్యావుల అభ్యంతరం వ్యక్తం చేశారు. సంతకాలు, ఒప్పందాలు చేసుకొని గోప్యత పాటించడం ఏమిటని నిలదీశారు. ప్రజలకు ఎలాగూ సరైన సమాచారం చెప్పడంలేదు, కనీసం అసెంబ్లీకి కూడా చెప్పరా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం చెప్పిన దానికంటే ఎక్కువే ఖర్చవుతుందని కేశవ్ చెబుతూ తన అంచనాలను అధికారులతో పంచుకున్నారు. ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి సమాచారం ఎప్పించుకోవాల్సి వస్తోందని అయన వ్యాఖ్యానించారు. ఈసారి జరిగే సమావేశానికి సరైన ఆధారాలతో రావాలని స్పష్టం చేశారు.

Also Read : అదానీ కోసమే: సోలార్ విద్యుత్ పై కేశవ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్