Monday, June 17, 2024
HomeTrending Newsఅదానీ కోసమే: సోలార్ విద్యుత్ పై కేశవ్

అదానీ కోసమే: సోలార్ విద్యుత్ పై కేశవ్

Payyavula Slams Ap Government For Its Decision On Solar Power :

రైతుల కోసం సోలార్ విద్యుత్ కొనాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ‘రైతుల కోసం పెట్టిన స్కీం కాదని, అదానీ కంపెనీ కోసం చేస్తున్న స్కాం’ అని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. అదానీ కంపెనీతో దొడ్డి దారిలో సోలార్ విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైందని కేశవ్ ఆరోపించారు. 6వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత టెండర్లు పిలిస్తే ఇదే అదానీ కంపెనీకి ఎక్కువ కాంట్రాక్టులు దక్కాయని, వాటిని కూడా పక్కన పెట్టి ఇప్పుడు మరో ఒప్పందానికి ప్రభుత్వం తయారుకావడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు.

నవంబర్ 2020 లో సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (SECI-సెకి) టెండర్లు పిలిచినప్పుడు అతి తకువ రేటు 2 రూపాయలుగా వచ్చిందని, అదానీ సంస్థ 2.99 రూపాయలకు కోట్ చేసిందని… గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సెకి ద్వారా టెండర్లు పిలిస్తే 1రూపాయి 99పైసలకే టెండర్ వేశారని కేశవ్ వివరించారు. ఎక్కువ రేటు చెబుతోందన్న కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాలూ  22 నెలల నుంచి అదానీ సంస్థ నుంచి సోలార్ విద్యుత్ కొనడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గంటల వ్యవధిలోనే ఒప్పందానికి ఆమోదం తెలపడం ఆశ్యర్యకరమన్నారు పయ్యావుల. అదానీ కంపెనీ సెప్టెంబర్ 15న సెకి లేఖ రాస్తే, ఆ మర్నాడే 16న కేబినేట్ సమావేశం పెట్టి ప్రభుత్వం ఒకే చెప్పిందన్నారు.

రోజురోజుకీ దేశంలో సోలార్ విద్యుత్ ధర తగ్గుతున్నా, సెకితో ఒప్పందం చేసుకుంటూ, యూనిట్‌ కరెంటు రూ.2.49 ల చొప్పున ఏడాదికి 7వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ను, 25 సంవత్సరాల పాటు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేశవ్ మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం అసత్యాలు చెబుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.

ప్రభుత్వం చెబుతున్న ఈ 2.49 రూపాయల రేటు రాష్ట్రంలోని డిస్కాం లకు చేరేనాటికి దాని విలువ యూనిట్ ఇంకా పెరుగుతుందని, దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కేశవ్ సవాల్ చేశారు. తనకున్న అంచనాల ప్రకారం అది యూనిట్ కు మూడున్నర నుంచి 4 రూపాయల వరకూ ఖర్చవుతుందని వివరించారు. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా అనేది  కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ వ్యాపార సంస్థ అని కేశవ్ స్పష్టం చేశారు.

Must Read :విద్యుత్ పై నిజాలు చెప్పండి: టిడిపి డిమాండ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్