Arrests In Kerala Wife Swapping :
కేరళ సెక్స్ రాకెట్ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు కేరళ సైబర్ సేల్ పోలీసులు 10 మందిని అరెస్టు చేశారు. రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు ఈ వ్యవహారంలో ఉండటంతో పోలీసులు పూర్తి వెల్లడించటం లేదు. కొందరు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు సెక్స్ రాకెట్ లో ఉన్నారని కేరళ మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
లైంగిక సుఖం కోసం ఎంతకైనా తెగించే పరిస్థితులు దాపురించాయి. మరీ దారుణంగా కేవలం లైంగిక సుఖం కోసం సభ్య సమాజం తలదించుకునేలా కొందరు ప్రబుద్దులు భార్యల మార్పిడి చేసుకున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదు వేల జంటలు ఈ సెక్స్ రాకెట్ లో పాలుపంచుకున్నాయి. కకోల్డ్ కేరళ, కపుల్ మీట్ కేరళ, మీట్ అప్ కేరళ తదితర పేర్లతో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని బార్యల మార్పిడి (partners exchange) చేసుకుంటున్నారు. అయితే కారుకాచల్ జిల్లా పతనాడ్ కు చెందిన 26 ఏళ్ళ మహిళా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సెక్స్ రాకెట్ బాగోతం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. లైంగిక సంబంధం కోసం భార్యలను మార్చుకున్నారు. లైంగిక సుఖం కోసం భార్యల మార్చుకున్న ఈ రాకెట్ లో దాదాపు ఐదు వేల జంటల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఇతర పురుషులతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు ఓ భర్త. దీనికి ఒప్పుకోని బాధితురాలు.. తన భర్తపై కొట్టయం జిల్లాలోని కారుకాచల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే లైంగిక సంబంధం కోసం భార్యలను మార్చుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
లైంగిక సంబంధం కోసం భార్యలను మార్చుకుంటున్నారని, ఈ రాకెట్ లో భాగమైన ఏడుగురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. అలాగే, మరో 25 మందికి పైగా పరిశీలనలో ఉన్నారని, మరో రెండు రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. ఇంతకుముందు కూడా రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. ఈ రాకెట్ లో భాగమైన ప్రధాన నిందితులు రాష్ట్రంలోని మూడు జిల్లాలకు చెందినవారని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు ఈ రాకెట్‌లో పాలుపంచుకున్నారని పోలీసులు తెలిపారు. సమాజంలో ఉన్నత స్ధాయి వ్యక్తులు ఈ గ్రూప్‌లో ఉన్నారని వెల్లడించారు. లైంగిక సంబంధం కోసం నడుపుతున్న ఈ రాకెట్ లో డబ్బు కూడా చేతులు మారుతున్నదని పోలీసులు తెలిపారు. 2019లో కాయంకులంలో భార్యల మార్పిడి నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే.
గతంలో ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో కార్లలో వచ్చిన జంటలు కారు తాళంచెవిలను ఒక దగ్గర వేసి ఎవరి చేతికి వచ్చిన దానిని వారు తీసుకొని ఆ కారులో ఉన్న స్త్రీని తీసుకెళ్లడం జరిగేది. తిరిగి వారు అనుకున్న సమయానికి తెల్లవారు జామున మొదట కలిసిన క్లబ్ లో కలుసుకొని ఎవరి దారిన వారు వెళ్ళిపోయేవారు. ఈ వ్యవహారంలో కూడా ఓ స్త్రీ ఫిర్యాదు చేయటంతో పోలీసులు అవాక్కయ్యారు. 1990ల్లో జరిగిన ఈ వ్యవహారంలో శివసేన అధిపతి బాల సాహెబ్ థాకరే పోలీసులు, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి నిందుతులను అరెస్టు చేయించి, శిక్ష పడేలా చేశారు.
Also Read : గల్లీ గల్లీలో బుల్లీ బాయ్