Monday, May 20, 2024
Homeస్పోర్ట్స్న్యూజిలాండ్ ఘన విజయం- సిరిసీ డ్రా

న్యూజిలాండ్ ఘన విజయం- సిరిసీ డ్రా

NZ won: రెండో టెస్టులో బంగ్లాదేశ్ పై న్యూజిలాండ్ ఇన్నింగ్స్, 117 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీనితో రెండు టెస్టుల సిరీస్ 1-1 తో డ్రా గా ముగిసింది. మొదటి ఇన్నింగ్స్ లో 126 పరుగులకే ఆలౌట్ అయి ఫాలో ఆన్ ఆడిన బంగ్లా రెండో ఇన్నింగ్స్ లో 278  పరుగులకు ఆలౌట్ అయ్యింది. లిటన్ దాస్(102) సెంచరీ చేశాడు, మిగిలిన వారిలో కెప్టెన్ హక్-37; నురుల్ హుస్సేన్-36; కాస్త ఫర్వాలేదనిపించారు.

రెండో ఇన్నింగ్స్ లో కివీస్ బౌలర్లు కేల్ జేమిసన్ నాలుగు; నీల్ వాగ్నర్ మూడు; సౌతీ, మిచెల్, రాస్ టేలర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో 252 పరుగులు చేసిన కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ కు ‘ ప్లేయర్ అఫ్ ద’ మ్యాచ్ లభించింది.

కివీస్ ఆటగాడు రాస్ టేలర్ క్రికెట్ కెరీర్ కు ఈ ఘనవిజయంతో సహచరులు ఘనంగా వీడ్కోలు పలికారు.

Also Read : న్యూజిలాండ్ 521/6; బంగ్లాదేశ్ 126 ఆలౌట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్