Saturday, March 14, 2026
HomeTrending Newsక్యాసినో నడిపితే నో పోలీస్: నారా లోకేష్

క్యాసినో నడిపితే నో పోలీస్: నారా లోకేష్

No Police: టిడిపి నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఎమ్మెల్సీ, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సింహా సినిమాలో నందమూరి బాలకృష్ణ డైలాగ్ తో విమర్శలు చేశారు.

‘గుడివాడ‌లో కొడాలి నాని క్యాసినో న‌డిపితే నో పోలీస్‌….. అదే గ‌డ్డం గ్యాంగ్ ప్ర‌తిప‌క్ష‌నేత‌ని బూతులు తిడితే నో పోలీస్‌…. చంద్రబాబు గారి ఇంటి పై దాడి చేస్తే నో పోలీస్‌….. టిడిపి కేంద్ర కార్యాల‌యాన్ని వైసీపీ మూక‌లు ధ్వంసం చేస్తే నో పోలీస్‌……. బూతులేంట్రా స‌న్నాసి నాని అని బుద్ధా వెంక‌న్న  నిల‌దీస్తే బిల‌బిల‌మంటూ వ‌చ్చి అరెస్ట్ చేశారు పోలీస్….” అంటూ లోకేష్ విమర్శలు గుప్పించారు.

ఏపీ పోలీసులు ప్ర‌జార‌క్ష‌ణ‌కి ఉన్నారా? నేరాలు చేసే వైసీపీ నేత‌లకు కాప‌లా కాస్తున్నారా? అని ప్రశ్నించారు. క్యాసినో వ్యవహారంపై టిడిపి నేతలు ఫిర్యాదు చెయ్యడానికి వెళితే కనీసం అనుమతించని డీజీపీ ఐపీఎస్ ముసుగులో ఎన్నాళ్లిలా వైసీపీ కోసం పని చేస్తారుని నిలదీశారు. వైసీపీలో చేరితే వాటాల్లేకుండా మీరే క్యాసినో నడుపుకోవచ్చు అంటూ సలహా ఇచ్చారు.

Also Read : నిరూపిస్తే దేనికైనా సిద్ధం: కొడాలి సవాల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular