Prove it: గుడివాడలో తనకు చెందిన కళ్యాణ మండపంలో కాసినో ఆడినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, అవసరమైతే పెట్రోలు పోసుకొని తగలబెట్టుకుంటానని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చాలెంజ్ విసిరారు. కోవిడ్ బారిన పడిన తాను రెండు వారాల తర్వాత నేడు కేబినేట్ సమావేశానికి నేరుగా వచ్చానని తెలిపారు. రెండున్నర ఎకరాల స్థలంలో తన కళ్యాణమండపం ఉందని, ఆ ఆవరణలో ఎక్కడైనా పేకాట ఆడినట్లు నిరూపించాలని సవాల్ చేశారు.  తటస్థంగా ఉండే మీడియా వెళ్లి విచారణ జరిపించుకోవాలని నాని సూచించారు. సచివాలయంలో కేబినేట్ భేటీ ముగిసిన తర్వాత మీడియా ప్రతినిధులు గుడివాడ కాసినో అంశంపై అడిగిన ప్రశ్నలకు కొడాలి ఘాటుగా స్పందించారు.

సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, జూదం ప్రతిచోటా జరిగినట్లే గుడివాడలో కూడా జరిగి ఉంటుందని, ఒకచోట ఆడవారితో డ్యాన్సులు చేయిస్తున్నారని సమాచారం వస్తే తానే స్వయంగా డీఎస్పీకి ఫోన్ చేసి  వెంటనే ఆపేయాల్సిందిగా సూచించానని తెలిపారు.

కాసినోల గురించి చంద్రబాబు, అయన కొడుకు లోకేష్ లకు బాగా తెలుసని, గతంలో లోకేష్ ఫోటోలు కూడా బైట పడ్డాయని కొడాలి గుర్తు చేశారు. నాడు లక్ష్మీ పార్వతిని అడ్డం పెట్టుకొని ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని, ఆ తర్వాత అమ్మాయిలను అడ్డం పెట్టుకొని సైకిల్ గుర్తు సంపాదించారని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజ నిర్ధారణ పేరుతో కొందరు సన్నాసులను గుడివాడ పంపి అల్లర్లు సృష్టించాలని బాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.  ప్రతి విషయంలో తనపై అల్లరి చేసి భ్రష్టు పట్టించాలని చూస్తున్నారని, కానీ బాబు, అయన పార్టీ నేతలు గిదివాడలో తనను ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు.

Also Read :వన్‌ డిస్ట్రిక్ట్‌ – వన్‌ ఎయిర్‌పోర్ట్ : సిఎం జగన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *