Saturday, September 21, 2024
HomeTrending Newsసమాఖ్య స్పూర్తికి బిజెపి విఘాతం - సిపిఎం

సమాఖ్య స్పూర్తికి బిజెపి విఘాతం – సిపిఎం

Federal Spirit Cpm : కేంద్ర ప్రభుత్వ తీరుపై తెరాస ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోందని, Trs బీజేపీ కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే స్వాగతిస్తామని సిపిఎం జాతీయ నాయకుడు ప్రకాష్ కారత్ స్పష్టం చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వ పాలసీ ప్రజల ఆకాoక్షలకు అనుకూలంగా పని చేయడం లేదని ఆరోపించారు. ఇలాంటి విధానాలను ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో ఈ రోజు ప్రకాశ్ కారత్ ప్రకటించారు. మోడీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కుదించి..కేంద్రం దగ్గర పెట్టుకునే పనిలో పడిందని, రాష్ట్రాలకు రావాల్సిన గ్రాంట్స్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రం కి లేఖ రాసిందన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో బీజేపీ కి సపోర్ట్ చేసిందని, కానీ ఇప్పుడు కేంద్రం విధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ  వ్యతిరేకిస్తూ ఉందని ప్రకాష్ కారత్ గుర్తు చేశారు. రాష్ట్రాల హక్కులు కేంద్రం కాల రాస్తుందన్న సిపిఎం నేత ఫెడరల్ స్ఫూర్తికి బిజెపి తూట్లు పొడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. Ias..ips లను తీసుకునే అంశంలో కూడా రాష్ట్రాల హక్కుల ను తీసుకునేందుకు చట్ట సవరణ చేస్తుందని ఆరోపించారు.

దేశం ఆర్ధిక సంక్షోభం లో ఉందని, కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని ప్రకాష్ కారత్ ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు 7500 రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడా వ్యాపారులకు బెనిఫిట్ కల్పించే ఆలోచన చేస్తున్న మోడీ ప్రభుత్వం పేదలకు సాయం చేసేందుకు ముందుకు రావడం లేదని విమర్శించారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు పనిచేస్తామన్న ప్రకాష్ కారత్ కలిసి వచ్చే లౌకిక పార్టీలను ఏకతాటి మీదకు తీసుకొస్తామని పేర్కొన్నారు. యూపీ, ఉత్తరాఖండ్ , పంజాబ్ లో మా పార్టీ బలం పరిమితంగా ఉందన్నారు. ఈ రాష్ట్రాల్లో బీజేపీని ఓడించే శక్తులకు మద్దతు ఇస్తామని, యూపీలో సమాజ్ వాది పార్టీకి  సిపిఎం సంపూర్ణ  మద్దతు ఉంటుందని ప్రకాష్ కారత్ తెలిపారు.

Also Read : ఎన్నికల సిత్రాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్