Its up to them: చర్చలకు రావాలని పిలిచినా ఉద్యోగ సంఘాల నేతలు రాకపోవడం బాధాకరమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంఘాల నేతలు పెడధోరణితో వ్యవహరించడం తగదని పేర్కొన్నారు. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గుతాయన్నది అపోహ మాత్రమేనని, అసలు జీతాలు పడితే కదా పెరిగిందీ, లేనిదీ తెలిసేది అని అన్నారు. ఉద్యోగులు, ప్రభుత్వం వేరు కాదని పురరుద్ఘాటించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలని, ఎక్కరికీ రూపాయి కూడా జీతం తగ్గదని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయ ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా అంటూ బొత్స ప్రశ్నించారు. ప్రభుత్వం తమకు బాధ్యత అప్పగించిందని, తాము నాలుగు మెట్లు దిగడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే దాన్ని అలుసుగా తీసుకోవద్దని హితవు పలికారు. ఉద్యోగ సంఘాల నేతలు ఇంట్లో కూర్చును తాము చర్చలకు వెళ్లబోమని చెబితే చట్టం తన పని తాను చేస్తుందని చెప్పారు. ఇకపై ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు వస్తామని చెబితే అప్పుడే తామూ వస్తామని, చర్చలకు తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని తేల్చి చెప్పారు.
ఉద్యోగులు ఎప్పుడైనా చర్చలకు రావాల్సిందేనని, చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లబిస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఉద్యోగుల్లో అపోహలను తొలగించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఇవాళ కొన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించామని, వారు తమ తమస్యలను వివరించారన్నారు. చర్చలకు ఎవరు వచ్చిన మాట్లాడతామని సజ్జల వెల్లడించారు.
Also Read : చర్చలే శరణ్యం: సజ్జల, బొత్స