Gangubai Coming: బాలీవుడ్ విజనరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘గంగూబాయి కథియావాడి’ చిత్రంలో అలియా భట్ టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ మూవీని బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్, భన్సాలీ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గంగూబాయి కథియావాడి విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 25న ఈ చిత్రం విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ప్రదర్శించబోతోన్నారని ప్రకటించారు.
సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు చిత్రయూనిట్ ప్రకటించింది. ‘బిగ్ అనౌన్స్ మెంట్.. సంజయ్ లీలా భన్సాలీ పెన్ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కించిన గంగూబాయి కథియావాడి ఫిబ్రవరి 25న విడుదల కాబోతోంది. అంతే కాకుండా 72వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతోన్నారు’ అని ప్రకటించారు. ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగణ్ నటించారు. సంజయ్ లీలా భన్సాలీ, డా. జయంతిలాల్ గడ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న థియేటర్లోకి రానుంది.
Also Read : పూరి జనగణమన ముహుర్తం ఫిక్స్(ఎక్స్ క్లూజీవ్)