Mayawati Campaigning In Punjab :

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఎన్నికల ప్రచారానికి సంసిద్ధం అవుతున్నారు. వచ్చే నెల 8వ తేదిన పంజాబ్ అన్నికాల సభలో పాల్గొంటారని బిఎస్పి పంజాబ్ శాఖ అధ్యక్షుడు జస్వీర్ సింగ్ గర్హి వెల్లడించారు. నవాన్ షహర్ లో జరిగే ఎన్నికల ప్రచార సభలో మాయావతి పాల్గొంటారని జస్వీర్ వివరించారు. మాయావతి రాకతో కాంగ్రెస్ దుష్ట పాలనకు అంతిమ గడియలు మొదలైనట్టేనని బిఎస్పి శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి. అయితే ఈ దఫా శాసనసభ ఎన్నికల్లో మాయావతి పోటీ చేయరని, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తారని బిఎస్పి ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా స్పష్టంచేశారు.

పంజాబ్ లో బిఎస్పి-శిరోమణి అకాలిదల్ కలిసి పోటీ చేస్తున్నాయి. పంజాబ్ జనాభాలో 31 శాతం ఉన్న దళితుల ఓట్లు కొల్లగోట్టాలంటే మాయావతి సహకారం తప్పనిసరి కావటంతో శిరోమణి అకాలిదల్ ఈ దఫా బిఎస్పి జత కట్టింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులకు అండగా ఉండటం శిరోమణి అకాలీదళ్ కు కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కేవలం దళిత ఓట్ల కోసమే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ అధిష్టానం చరణ్ జిత్ సింగ్ చన్నికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని, ఆ తర్వాత మార్పు ఖాయమని పంజాబ్ లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

కొన్నాళ్ళుగా మాయావతి ఆరోగ్యం బాగోలేదని ఎక్కువగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మాయావతి పంజాబ్ పర్యటన పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం ఇవ్వనుంది.  వచ్చే నెల 20 వ తేదిన జరిగే ఎన్నికల పోలిగ్ లో పార్టీల భవితవ్యం తేలనుంది. మార్చి పదవ తేదిన పంజాబ్ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

Also Read : ఎన్నికల సిత్రాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *