Monday, June 17, 2024
Homeసినిమాపూరి జ‌న‌గ‌ణ‌మ‌న ముహుర్తం ఫిక్స్(ఎక్స్ క్లూజీవ్)

పూరి జ‌న‌గ‌ణ‌మ‌న ముహుర్తం ఫిక్స్(ఎక్స్ క్లూజీవ్)

Combo confirmed: డేరింగ్ అండ్ డాషింగ్ పూరి జ‌గ‌న్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జ‌న‌గ‌ణ‌మ‌న‌’. ఈ భారీ చిత్రాన్ని సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో తెర‌కెక్కించాల‌ని పూరి ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నిస్తున్నారు కానీ… కుద‌ర‌లేదు. మ‌హేష్ కి క‌థ చెప్ప‌డం… ఆయ‌న‌కు న‌చ్చ‌డం.. కూడా జ‌రిగింది కానీ.. ఆత‌ర్వాత‌ ఏమైందో ఏమో ప్రాజెక్ట్ ముందుకు వెళ్ల‌లేదు. దీంతో పూరి ఈ క‌థ‌ను వెంక‌టేష్ కి చెప్ప‌డం జ‌రిగింది. వెంకీకి కూడా జ‌న‌గ‌ణ‌మ‌న క‌థ బాగా న‌చ్చింది. అయితే.. దీనికి భారీ బ‌డ్జెట్ అవుతుంది. వెంకీతో అంత బ‌డ్జెట్ తో వ‌ర్క‌వుట్ కాద‌ని అక్క‌డా సెట్ కాలేదు.

ఆత‌ర్వాత కేజీఎఫ్ స్టార్ య‌శ్ కి క‌థ చెప్ప‌డం.. ఆయ‌న ఓకే అన్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఏమైందో ఏమో కానీ.. అక్క‌డ కూడా సెట్ కాలేదు. ఆత‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో జ‌న‌గ‌ణ‌మ‌న అని వార్త‌లు వ‌చ్చాయి కానీ అఫిసియ‌ల్ గా అనౌన్స్ మెంట్ రాలేదు. ఆత‌ర్వాత ఈ క‌థ‌ను ప‌క్క‌న‌పెట్టేసి రామ్ తో ఇస్మార్ట్ శంక‌ర్ మూవీ చేయ‌డం.. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో పూరి మ‌ళ్లీ ఫామ్ లోకి రావ‌డం తెలిసిందే.
ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో లైగ‌ర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది.

ఆగ‌ష్టు 25న లైగ‌ర్ మూవీ విడుద‌ల కానుంది. అయితే… విజ‌య్ దేవ‌ర‌కొండ‌తోనే పూరి త‌న డ్రీమ్ ప్రాజెక్ట్  ‘జ‌న‌గ‌ణ‌మ‌న’ చిత్రం చేయ‌నున్నారని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. తాజా వార్త ఏంటంటే… ఈ క్రేజీ ప్రాజెక్ట్ క‌న్ ఫ‌ర్మ్ అయ్యింది. వ‌చ్చే నెల‌లోనే జ‌న‌గ‌ణ‌మ‌న చిత్రం షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫ‌స్ట్ షెడ్యూల్ అమెరికాలో భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో విజ‌య్ స‌ర‌స‌న అతిలోక‌సుంద‌రి శ్రీదేవి ముద్దుల కూతురు జాహ్న‌వి న‌టించ‌నుంది. క‌ర‌ణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. లైగ‌ర్ రిలీజ్ టైమ్ (ఆగ‌ష్టు 25)కి జ‌న‌గ‌ణ‌మ‌న షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని స‌మాచారం.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్