Saturday, November 23, 2024
HomeTrending Newsఅండర్ 19 వరల్డ్ కప్ : ఫైనల్లో ఇండియా

అండర్ 19 వరల్డ్ కప్ : ఫైనల్లో ఇండియా

Yuva Bharath: యువ ఇండియా నాలుగోసారి క్రికెట్ ఐసిసి అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ప్రవేశించింది. నిన్న రాత్రి ఆంటిగ్వా లోని కూలిడ్జ్ క్రికెట్ మైదానంలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ను 96 పరుగుల తేడాతో ఓడించింది. కెప్టెన్ యష్ దుల్ సెంచరీ తో రాణించి విజయంలో కీకలపాత్ర పోషించాడు.

టాస్ గెలిచిన ఇండియా  బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా నెమ్మదిగా ఆట మొదలుపెట్టింది, 16 పరుగుల వద్ద తొలి వికెట్ (రఘువంశి-6)  కోల్పోయింది. ఆ వెంటనే హర్నూర్ సింగ్ కూడా 16 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.  ఈ దశలో కెప్టెన్ యష్ దుల్, షేక్ రషీద్ లు మూడో వికెట్ కు 204 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు.  యష్ 110 బంతుల్లో  10 ఫోర్లు, ఒక సిక్సర్ తో 110 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. రషీద్ 108 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ తో  94 పరుగులు చేశాడు.

చివర్లో వికెట్ కీపర్ దినేష్ భనా కేవలం నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 20 పరుగుల ధనాధన్ బ్యాటింగ్ చేయడంతో ఇండియా నిర్ణీత 50  ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో జాక్ నిస్బేట్ , జాక్ సిన్ ఫీల్డ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఆసీస్ మూడు పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. టీగ్ వైలీ ఒక పరుగు మాత్రమే చేసి రవి కుమార్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. రెండో వికెట్ కు మరో ఓపెనర్ క్యాంప్ బెల్-కోరీ మిల్లర్ లు 68 పరుగులు చేశారు. అయితే ఈ దశలో ఇండియా బౌలర్లు రాణించి వరుసగా వికెట్లు సాధించారు. లచ్లాన్ షా-51;  క్యాంప్ బెల్-30; కోరీ మిల్లర్-38; మినహా మిగిలిన బ్యాట్స్ మెన్ పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు. దీనితో 41.5  ఓవర్లలో 194 పరుగులకే అసీస్ ఆలౌట్ అయ్యింది.

ఇండియా-19 బౌలర్లలో విక్కీ ఓత్సల్ మూడు, నిశాంత్ సింధు, రవి కుమార్ చెరో రెండు, కుశాల్ తంబి, రఘు వంశీ చెరో వికెట్ సాధించారు.

యష్ దుల్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

ఫిబ్రవరి 6న ఆంటిగ్వా నార్త్ సౌండ్ లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగే ఫైనల్లో ఇండియా- ఇంగ్లాండ్ తలపడనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్